Advertisement
Google Ads BL

గుంటూరు కారంలో అతి పెద్ద మార్పులు


మహేష్ బాబు త్రివిక్రమ్ తో మూడో సినిమా మొదలు పెట్టినప్పటినుండి ఏదో ఒక అవాంతరం వస్తూనే ఉంది. మహేష్ బాబుతో సినిమా ప్రకటించగానే ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది అంటూ త్రివిక్రమ్ పూజ హెగ్డే పేరుని అఫీషియల్ గా ప్రకటించారు. అలాగే సెకండ్ హీరోయిన్ గా అప్పుడే ఫామ్ లోకొస్తున్న శ్రీలీలని అనుకున్నారు. శ్రీలీల పేరు సెకండ్ హీరోయిన్ కింద ప్రకటించకుండానే సెట్స్ లోకి తీసుకెళ్లిపోయారు. ఇక ఫస్ట్ షెడ్యూల్ పూర్తి కాగానే ఆ ఎపిసోడ్ మహేష్ కి నచ్చలేదంటూ పక్కనపడేసారు. 

Advertisement
CJ Advs

రెండో షెడ్యూల్ విషయంలోనూ ఈరకమయిన వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు గుంటూరు కారంలో జరిగిన అతి పెద్ద మార్పులు అంటూ మీడియాలో ఓ న్యూస్ హైలెట్ అయ్యింది.  అది పూజ హెగ్డే ని ఈ ప్రాజెక్ట్ నుండి తప్పించి ఆమె ప్లేస్ లోకి మెయిన్ హీరోయిన్ గా శ్రీలీలని కన్ ఫామ్ చేసిన త్రివిక్రమ్ సెకండ్ హీరోయిన్ గా మీనాక్షికి చౌదరిని తీసుకున్నట్లుగా తెలుస్తుంది. పూజా హెగ్డే డౌన్ ఫాల్ లో ఉండడం, శ్రీలీల హ్యాండ్ రేజింగ్ లో ఉండడంతోనే ఈ మార్పుకి ప్రధాన కారణమని తెలుస్తుంది.

అంతేకాకుండా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ప్లేస్ లోకి అనిరుద్ వచ్చినట్లుగా వార్తలొస్తున్నాయి.. ఈ విషయమై మాత్రం క్లారిటీ లేదు, కారణం ఈ వార్తపై థమన్ కూడా సెటేరికల్ గా స్పందించిన విషయం తెలిసిందే. ఇక ఈరోజు నుండే హీరో గారి ఇంటి సెట్ లో గుంటూరు కారం ఈ మార్పులతో కొత్త షెడ్యూల్ మొదలుపెట్టుకుంది. హైదరాబాద్ లో జరుగుతున్న ఈ షెడ్యూల్ లో మహేష్ బాబు-రఘుబాబు-ఈశ్వరి రావు లపై కీలక సన్నివేశాల చిత్రీకరణ చేపట్టారు త్రివిక్రమ్.

Here are major changes in Guntur Karam :

Guntur Karam changes revealed
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs