Advertisement
Google Ads BL

డ్రగ్స్ కేసుపై అషు రెడ్డి ఫస్ట్ రియాక్షన్


నిన్న సోషల్ మీడియాలో ఒక్కసారిగా బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పేరు హైలెట్ అయ్యింది. మీడియా ఛానల్స్ లోనూ, సోషల్ మీడియాలోనూ, వెబ్ మీడియాలో అషు రెడ్డి పేరు మోగిపోయింది. కారణం డ్రగ్స్ కేసు. నిర్మాత KP చౌదరిని పోలీసులు డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేసి రిమాండ్ లో ఉంచి విచారణ చేప్పట్టగా, KP చౌదరి విచారణలో భాగంగా 12మందికి డ్రగ్స్ విక్రయించినట్టుగా చెప్పడమే కాకుండా.. ఆయన ఫోన్ లో బిగ్ బాస్ అషు రెడ్డితో పాటుగా మరో ఐటెం హీరోయిన్ తో వందల ఫోన్ కాల్స్ మాట్లాడినట్టుగా, వీరిద్దరికి పలుమార్లు చౌదరి డ్రగ్స్ విక్రయించినట్టుగా పోలీసుల ముందు KP చౌదరి బయటపెట్టినట్లుగా చెప్పారు.

Advertisement
CJ Advs

అయితే ఈ కేసులో అషు రెడ్డి పేరు బాగా వినిపించడంతో.. కొంతమంది అషు రెడ్డి ఫోన్ నెంబర్ లీక్ చేసి వైరల్ చెయ్యగా.. వీటిపై అషు రెడ్డి వెంటనే స్పందించింది. కొంతమంది తనకున్న పరిచయాలపై కొన్ని మీడియా ఛానల్స్ నిజాలని దాచి పెట్టి అవాస్తవాలను ప్రచారం చేస్తున్నాయి. కొన్ని గంటలుగా తనపై వస్తున్న ప్రతి వార్తను తాను ఖండిస్తున్నాను అని, ఒకవేళ అంతవరకు వస్తే డ్రగ్స్ కేసుకు సంబంధించి విచారణ చేపట్టేవారికి చెప్పాల్సిన నిజాలు చెబుతానని చెప్పింది.

అంతేకాకుండా తన ఫోన్ నెంబర్ ని ఇలా పబ్లిక్ లో ఉంచడాన్ని తాను ఎంత మాత్రం ఊరుకోను అంటూ హెచ్చరించింది. అయితే KP చౌదరి అషు రెడ్డితో ఫోన్ కాల్స్ మాట్లాడడమే కాకుండా.. ఆమెతో కలిసి ఫోటోలు కూడా దిగినట్లుగా, అవి ఫోన్ లో దొరికినట్లుగా చెబుతున్నారు. మరి అషు రెడ్డిపై ఆరోపణలు వచ్చిన కొద్ది గంటల్లోనే ఆమె ఈ కేసుపై స్పందించడం హాట్ టాపిక్ గా మారింది. 

Ashu Reddy first reaction on the drug case:

Ashu Reddy In KP Chowdary Drugs Case
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs