కిర్రాక్ ఆర్పీ ఇప్పుడు చేపల పులుసు ఆర్పీ అయ్యాడు. కూకట్ పల్లిలో మొదలు అనంతపూర్ వరకు ఆర్పీ చేపల పులుసు విస్తరించింది. హైదరాబాద్ లో కూకట్ పల్లి, మాదాపూర్, SR నగర్ లలో బ్రాంచెస్ ఓపెన్ చేసి హడావిడి చేసిన ఆర్పీ ఇప్పుడు అనంతపూర్ లోను ఓ బ్రాంచ్ ఓపెన్ చేసాడు. నెల్లూరు చేపల పులుసు అంటూ హైదరాబాద్ లోనే ఆర్పీ 250 రూపాయలకు అమ్మాడు. రెండు ముక్కలు కొద్దిగా పులుసుకి ఆర్పీ ఆ రేటుని చేపల పులుసుకి పెట్టాడు. కుండలో ఇస్తే మరో రేటు.. ఇలా ఆర్పీ చేపల పులుసు కాస్ట్లీ అన్నారు. అయినా ఆర్పీ చేపల పులుసు కోసం జనాలు ఎగబడ్డారు.
ఇక ఇప్పుడు అనంతపూర్ లో తెరిచిన ఆర్పీ చేపల పులుసుకి కూడా యూట్యూబ్ ఛానల్స్ అండ మొదలైంది. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఆర్పీ అనంతపూర్ చేపల పులుసు షాప్ కి కిచెన్ కి వెళ్లి మళ్ళీ చేపల పులుసు టూర్ స్టార్ట్ చేసారు. అయితే అక్కడ ఆర్పీ చేపల పులుసు యమా కాష్ట్లీగా కనిపిస్తుంది. కేజీ కోరమీను పులుసు అక్షరాలా 1800 రూపాయలు. అంటే మామూలుగానే కోరమీను కొద్దిగా కాస్ట్ ఎక్కువ. అది కూరగా వంగేసరికి 1800 రూపాయలు అయ్యింది. అంటే కోరమీనులోని మధ్య భాగాన్ని మాత్రమే అంటే తలా తోక లేకుండా కేజీ తూకం వేసి వండిన పులుసు అన్నమాట,
ఎంతెలా చేసినా ఒక్క KG చేపల పులుసు 1800 లంటే మాములు విషయం కాదు. కానీ ఆర్పీ మాత్రం దాన్ని వండటానికి ఎంత ఖర్చు అవుతుందో అందుకు తగ్గట్టుగానే దానికి రేటు అంటూ సింపుల్ గా తేల్చేస్తున్నాడు. మరి సహజంగానే కోరమీను కేజీ దాదాపుగా 4 నుండి 500 రేటు పలుకుతుంది. దీనిని కూరగా వండితే 1800 అవుతుందన్నమాట.