రామ్ చరణ్-ఉపాసనలకు పాప జన్మించడంతో మెగా ఫ్యామిలిలో ఆనందం వెల్లువిరిసింది. మెగా ప్రిన్సెస్ అంటూ మెగాస్టార్ మనవరాలిని చూసొచ్చి మురిసిపోయారు. ఇక ఉపాసన గత నాలుగు రోజులుగా ఆసుపత్రిలోనే ఉంది. బేబీ పుట్టాక డాక్టర్స్ ఆధ్వర్యంలో ఉన్న ఉపాసన నేడు పూర్తి ఆరోగ్యంతో ఆసుపత్రి నుండి డిశ్ఛార్జ్ అయ్యింది. భర్త రామ్ చరణ్, తల్లి శోభనలతో ఉపాసన హెల్దీగా నడిచొస్తున్న విజువల్స్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఉపాసన చేతిలో ఆమె బేబీ ఉండగా.. తర్వాత రామ్ చరణ్ తన మెగా ప్రిన్సెస్ ని ఎత్తుకున్నాడు.
ఇక ఉపాసనని, బేబీని మీడియాకి చూపించినా.. మెగా ప్రిన్సెస్ ఫేస్ కనిపించకుండా కవర్ చేస్తూ ఉపాసనని ఆమె తల్లితో పాటుగా పంపేసిన చరణ్ తర్వాత మీడియాతో మట్లాడారు. బేబీకి పేరేం పెడుతున్నారు, ఎప్పుడు పెడుతున్నారు, మొదటిసారి బిడ్డని చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఎలా ఫీలయ్యారంటూ రామ్ చరణ్ కి మీడియా గుక్కతితప్పికోకుండా ప్రశ్నలు సాధించగా.. రామ్ చరణ్ మాత్రం కూల్ గా తన్న బిడ్డని ఎత్తుకున్నప్పుడు ప్రతి తండ్రి ఎలా ఫీలవుతాడో నేనూ అలానే ఫీలయ్యాను, అంతకన్నా ఏం చెప్పాలి. ఇక బేబీ పేరు 12 రోజో.. 13 రోజో అంటారు కదా.. నాకు సాంప్రదాయాలు పెద్దగా తెలియదు అనగానే.. ఎవరో 21వ రోజున పెడతారు అని అరిచారు. దానికి చరణ్ కూడా ఆ 21 రోజున పాప పేరు పెడతాము అన్నారు.
దానికి మిడియా మిత్రులు పాప పేరేమనుకున్నారు అని అడగ్గా. నేను ఉపాసన ఓ పేరు అనుకున్నాము. అది పాపకి 21వ రోజు పెట్టాక మేమే చెబుతాము అంటూ తప్పించుకున్నారు. ఇక మా పాపకి అభిమానులు, అందరి బ్లెస్సింగ్ కావాలి అని, మాకు ఇంత సపోర్ట్ గా ఉన్న ఫాన్స్ కి, ఉపాసనకు ఎలాంటి ఇస్యూస్ లేకుండా డెలివరీ చేసిన అపోలో డాక్టర్స్ కి పేరు పేరునా చరణ్ కృతజ్ఞతలు తెలియజేసిన చరణ్ ఇంతకుమించి మాట్లాడడానికి మాటలు రావడం లేదు అంటూ ఎమోషన్ అయ్యారు.