Advertisement
Google Ads BL

వరుణ్, లావణ్యల పెళ్లి ప్లానింగ్ ఇదేనా?


మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లవ్‌లీ బ్యూటీ లావణ్య త్రిపాఠి త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతోన్న విషయం తెలిసిందే. ఇటీవల వీరి నిశ్చితార్థం కుటుంబ సభ్యుల సమక్షంలో గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు మెగా, అల్లు ఫ్యామిలీ మెంబర్స్‌తో పాటు.. అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. అయితే నిశ్చితార్థం పూర్తయినప్పటికీ.. వివాహ తేదీ మాత్రం ఇంకా రివీల్ చేయలేదు. అసలింకా వివాహానికి తేదీనే ఫిక్స్ చేయలేదని అంటున్నారు.

Advertisement
CJ Advs

ప్రస్తుతం వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి చేస్తున్న సినిమాలు పూర్తవ్వగానే.. ఓ ఆరు నెలల పాటు బ్రేక్ ఇచ్చి.. వివాహం చేసుకోవాలనేది వారి ప్లాన్‌గా తెలుస్తుంది. అంతే కాదు, వారి పెళ్లి ఎక్కడ జరగాలనే దానిపై ఇద్దరూ చాలా ప్లాన్స్ చేస్తున్నట్లుగా టాక్ నడుస్తోంది. వివాహ వేదిక కోసం ఇప్పటికే వారు పలు దేశాలను పరిశీలిస్తున్నట్లుగా సమాచారం. నిశ్చితార్థానికి ముందే డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలని ఇద్దరూ నిశ్చయించుకున్నారట. అందుకే ఇప్పుడు సరైన ప్లేస్ కోసం సెర్చ్ చేస్తున్నారనేలా టాక్ వినిపిస్తోంది. 

ఇరు ఫ్యామిలీ మెంబర్స్‌తో పాటు.. స్నేహితులు, బంధువుల సమక్షంలో ఫారెన్ రిసార్ట్‌లో మూడు రోజుల పాటు వారి పెళ్లి వేడుకను జరుపుకోవాలనేలా వరుణ్, లావణ్య ప్లాన్ చేస్తున్నారట. అందుకోసం అనువైన విధంగా ఉండే రిసార్ట్ కోసం సెర్చ్ చేస్తున్నారట. త్వరలోనే ఈ జంట తమ పెళ్లి తేదీని ప్రకటించనున్నారని కూడా తెలుస్తోంది. ప్రస్తుతం మెగాస్టార్‌కి మనవరాలు పుట్టిన ఆనందంలో మెగా ఫ్యామిలీ అంతా సంబరాలు జరుపుకుంటోంది. వెంటనే వరుణ్ తేజ్ పెళ్లి కూడా లైన్‌లో పెట్టేసి.. ఆ ఆనందాన్ని అలా కంటిన్యూ చేసే ప్రాసెస్‌లో మెగా ఫ్యామిలీ ఉందనేలా టాక్ వినబడుతోంది.

Varun Tej and Lavanya Tripathi Starts Their Wedding Plans :

Varun Tej and Lavanya are Searching for a Foreign Resort
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs