గత సోమవారం డెలివరీ కోసం అత్త సురేఖ, భర్త చరణ్, అమ్మ శోభన గార్లతో కలిసి అపోలో ఆసుపత్రిలో అడ్మిట్ అయిన కొద్ది గంటలలోనే ఉపాసన కొణిదెల పండండి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తెల్లవారేసరికి మెగా ఫ్యామిలోకి మెగా ప్రిన్సెస్ వచ్చేసింది అంటూ మీడియా కబురు అందించేసింది. ఆ తర్వాత మెగా ఫ్యామిలీ మెంబెర్స్ ఒక్కొక్కరిగా ఉపాసన కోసం ఆమెకి పుట్టిన బిడ్డని చూసేందుకు క్యూ కట్టారు మనవరాలిని చూసిన ఆనందంలో మెగాస్టార్ చిరంజీవి మెగా ప్రిన్సెస్ పుట్టింది, మా మనవరాలు మహార్జాతకురాలు. మంచి సమయంలో జన్మించింది, ఆమె పుట్టిన వేళా విశేషం మా ఇంట్లోనే అన్నీ శుభకార్యములు జరుగుతున్నాయంటూ మీడియాతో మట్లాడారు.
కానీ చరణ్ ఇప్పటివరకు మీడియా ముందు రాలేదు. అయితే సోమవారం సాయంత్రం నుండి ఆసుపత్రిలో ఉన్న ఉపాసన ఈ రోజు మద్యాన్నం డిశ్చార్జ్ అవుతుంది. ఉపాసన నాలుగు రోజులపాటు అపోలో వైద్యుల సంరక్షణలో ఉంది.. ఈరోజు తన బేబీతో కలిసి ఇంటికి వెళ్లబోతుంది. అయితే డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్లేముందు రామ్ చరణ్-ఉపాసనలు మీడియా ముందుకు రాబోతున్నారు. మధ్యాన్నం వీరిద్దరూ మీడియాతో ముచ్చటించబోతున్నారు. అయితే ఉపాసనకు నార్మల్ డెలివరీ అయ్యిందా.. లేదంటే ఆమెకి సిజేరియన్ చేసి బేబీని తీసారా అనే విషయంలో చాలామంది ఆతృతగా ఉన్నారు
మీడియా ముందుకు వచ్చే ఉపాసన తన డెలివరీ ఎలా జరిగిందో ఎమన్నా చెబుతారేమో అని చాలామంది వెయిట్ చేస్తున్నారు. చరణ్ కూడా కామ్ గా కూతురిని భార్యని తీసుకుని వెళ్లిపోకుండా భార్యతో కలిసి మీడియా ముందుకు రావడం మెగా ఫాన్స్ ని ఆనందంలోకి నెట్టేసింది. చరణ్-ఉపాసనలు తమ బేబీ ని మీడియా కి చూపిస్తారమేమో అనే ఆరాటంలో అభిమానులు కనిపిస్తున్నారు.