తమన్నా ఈ మధ్యనే బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ తో లవ్ లో ఉన్నాను అంటూ తన డేటింగ్ సీక్రెట్ విప్పింది. లస్ట్ స్టోరీస్2 వెబ్ సీరీస్ షూటింగ్ లోనే తమ మధ్యన ప్రేమ పుట్టింది అంటూ అసలు విషయాన్ని బయటపెట్టిన తమన్నా తన బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మని ఇప్పుడు ఊసరవెల్లి అనడం అందరికి షాకిచ్చింది.. కానీ తమన్నా ఊసరవెల్లికి అర్ధం వేరే చెబుతుందిలే.. విజయ్ ఊసరవెల్లిలా రంగులు మారుస్తూ నిర్దిష్టమైన పాత్ర కోసం ఎలాగైనా మారతాడని చెప్పింది. అందుకే అతన్ని ఊసరవెల్లితో పోల్చింది. అంతేకాని.. అతను తనని మోసం చేసాడని కాదండోయ్.
తాజాగా లస్ట్ స్టోరీస్2 ప్రమోషన్స్ లో భాగంగా తమన్నా తనతో విజయ్ కి పరిచయం ఎలా ఏర్పడిందో.. మొదటి ఇంప్రెషన్ ఏమిటి, తనని మొదటిసారి చూసి విజయ్ ఏమనుకున్నాడో అనేది రివీల్ చేసింది. తాను లస్ట్ స్టోరీస్2 షూటింగ్ కి వెళ్ళిన మొదటి రోజే షూటింగ్ ఆపెయ్యాల్సి వచ్చింది. కారణం తనకి ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం వలనే మొదటి రోజు షూటింగ్ ఆపేశారని.. కానీ విజయ్ మాత్రం తనకి ఈ సీరీస్ షూటింగ్ అంటే భయం వేసి షూటింగ్ కి రాలేదు అనుకున్నాడు, తాను ఈ సీరీస్ కోసం ఏడెనిమిది రోజులు షూట్ చేశాను. కానీ ఇది చాలా కష్టంగా అనిపించింది.
మొదటి రోజు షూటింగ్ రద్దు చేసినప్పుడు నేను ఈ సీరీస్ పట్ల భయంగా, పిరికితనంగా ఉన్నట్లుగా విజయ్ భావించాడు. కానీ నేను మాత్రం ఓ పవర్ ఫుల్ నటుడితో వర్క్ చేస్తున్నట్లుగా భావించాను. అంతేకాదు విజయ్ ఓ ఊసరవెల్లి, నిర్దిష్తమైన పాత్ర కోసం ఎలాగైనా మారతాడు, గతంలోనూ తన హార్డ్ వర్క్ ని చూసాను అంటూ మరోసారి విజయ్ వర్మతో తన పరిచయం, మొదటి ఇంప్రెషన్ గురించి చెప్పుకొచ్చింది తమన్నా.