పుష్ప ద రైజ్ తో ప్యాన్ ఇండియా మార్కెట్ ని షేక్ చేసిన అల్లు అర్జున్-సుకుమార్ లు దానికి సీక్వెల్ గా పుష్ప ద రూల్ ని తెరకెక్కిస్తున్నారు. మొన్నటివరకు తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లు ఫారెస్ట్ లో షూటింగ్ ని చిత్రీకరించిన సుకుమార్ ప్రస్తుతం పుష్ప 2 ని హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీకి షిఫ్ట్ చేసారు. అల్లు అర్జున్ లేని కొన్ని సన్నివేశాల చిత్రీకరణ సుకుమార్ రామోజీ ఫిలిం సిటీలో వేసిన ఓ సెట్ లో చేపట్టినట్లుగా తెలుస్తుంది. సైలెంట్ గా షూటింగ్ చిత్రీకరణ చేపట్టిన ఈ సన్నివేశాల్లో కీలక పాత్రలు పోషిస్తున్న అనసూయ లాంటి నటులు పాల్గొంటున్నారు.
త్వరలోనే అల్లు అర్జున్ కూడా ఈ షెడ్యూల్ లో జాయిన్ అవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇంతకుముందే సుకుమార్ విలన్ పాత్రధారి భన్వర్ లాల్ షెకావత్ ఫహద్ ఫాసిల్ పై కీలక యాక్షన్ ఘట్టాలను చిత్రీకరించారు. రీసెంట్ గా పుష్ప ద రూల్ చిత్రీకరణ మారేడుమిల్లు అడవుల్లో చేపట్టినప్పుడు అక్కడ నదిలో ఎర్ర చందనం లోడుతో వెళుతున్న లారీల వీడియో సోషల్ మీడియాలో లీకై సెన్సేషన్ క్రియేట్ చేసింది. సుకుమార్ ప్రస్తుతం ఫిలిం సిటీలో కీలక సీక్వెన్స్ చిత్రీకరణలో బిజీగా వున్నట్లుగా తెలుస్తుంది.
ఇక ఓ మంచి రోజు చూసుకుని పుష్ప ద రూల్ రిలీజ్ డేట్ ప్రకటిస్తారని.. అయితే ఈ పుష్ప ద రూల్ ఈ ఏడాది విడుదలయ్యే ఛాన్స్ లేదు అంటున్నారు. అందుకే ఇప్పటివరకు రిలీజ్ డేట్ ఇవ్వలేదని.. పుష్ప పార్ట్ 2 వచ్చే ఏడాది సమ్మర్ లోనే ఉంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.