నిన్న జూన్ 21 యోగ డే. చాలామంది యోగ డే ని యోగాసనాలతో సెలెబ్రేట్ చేసుకోవడమే కాదు.. హీరోయిన్స్ అయితే తాము వేసిన యోగాసనాల పిక్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేసారు. కీర్తి సురేష్, ప్రణీత సుభాష్ లాంటి హీరోయిన్స్ యోగాసనాలు వేస్తూ ఆ వీడియోస్, ఫొటోస్ ని షేర్ చేసారు. అయితే సినిమా ఇండస్ట్రీకి పరిచయం లేని మంచు మనోజ్ వైఫ్ మౌనిక రెడ్డి కూడా యోగ డే రోజున రేర్ ఫీట్ సాధించింది. ఈ ఏడాది మార్చి లో మంచు మనోజ్ శోభా నాగిరెడ్డి కుమార్తె మౌనిక రెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. మౌనిక ఫ్యామిలీ, మంచు ఫ్యామిలీ.. మధ్యన మంచి ఫ్రెండ్ షిప్ ఉంది.. ఇప్పుడది చుట్టరికంగా మారింది..
అయితే మనోజ్ తాజాగా తన భార్య యోగాసనం వేసిన పిక్ ని షేర్ చేస్తూ.. తన భార్య మౌనిక 108 సూర్య నమస్కారాలు వేసినట్టుగా ఇన్స్టాలో పోస్ట్ చేసాడు. మౌనిక కాస్త బొద్దుగా ఉంటుంది. అలాంటి అమ్మాయి 108 సూర్య నమస్కారాలు చెయ్యడం అందరిని ఆశ్చర్యపరిచింది. మై వైఫ్ మౌనిక అంటూ యోగాసనం వేస్తున్న పిక్ ఇన్స్టా స్టోరీస్ లో చెర్ చెయ్యగా అది ఇట్టే వైరల్ అయ్యింది. ఇక మౌనిక కూడా యోగ డే సందర్భంగా నా ఫ్రెండ్స్ అందరికి యోగ డే శుభాకాంక్షలు.
ఈరోజు 108 సూర్య నమస్కారాలు పూర్తి చేసి యోగ పై ఉన్న నా ప్రేమని అంకితం చేస్తున్నాను. యోగాని పరిచయం చేసిన మా అమ్మ శోభా నాగిరెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలంటూ ట్వీట్ చేసింది. మరి ఒక్కసారే 108 సూర్య నమస్కారాలు వెయ్యడమనేది చాలా రేర్ గా చెప్పొచ్చు. ఇప్పుడు ఆ ఫీట్ ని మౌనిక సాధించి వార్తల్లో నిలిచింది. అందుకే మనోజ్ అంత హ్యాపీగా మౌనిక పిక్ నిషేర్ చేసాడు అంటున్నారు నెటిజెన్స్.