Advertisement
Google Ads BL

ఏడాదిలో 20 కోట్లు సంపాదిస్తున్న హీరోయిన్


ఏడాదిలో 20 కోట్లు సంపాదించడమంటే బాలీవుడ్ హీరోయిన్స్ కి మాత్రమే సాధ్యం.. సౌత్ హీరోయిన్స్ కి సాధ్యమయ్యే అవకాశం లేదు అనుకుంటున్నారా.. ఇప్పుడొక సౌత్ హీరోయిన్ ఏడాదికి 20 కోట్లు సంపాదించబోతుంది. 2024-20 ఏడాదిలో తెలుగు హీరోయిన్ శ్రీలీల అక్షరాలా 20 కోట్లు వెనకేసుకోబోతుంది. అంత పెద్దమొత్తం ఒక్క సినిమాతో సాధ్యం కాకపోయినా.. ఆమె నటిస్తున్న ప్రాజెక్ట్స్ అన్ని కలిపి 20 కోట్లు శ్రీలీల జమవడం ఖాయంగా కనిపిస్తుంది. 

Advertisement
CJ Advs

ప్రస్తుతం ఎనిమిది ప్రాజెక్ట్స్ ఆమె చేతిలో ఉండగా.. అందులో ఒకటి రెండు ఈ ఏడాది రిలీజ్ అవుతాయి. ముఖ్యంగా రామ్-బోయపాటి మూవీ, బాలకృష్ణ భగవంత్ కేసరి రిలీజ్ అవుతాయి. ఇక ఆమె నటించే మరో ఆరు ప్రాజెక్ట్స్ 2024 నుండి 2025 లో విడుదల కాబోతున్నాయి. ప్రస్తుతం సౌత్ లో క్రేజీ హీరోయిన్ గా మారిన శ్రీలీల ఒక్కో ప్రాజెక్ట్ 2 నుండి 3 కోట్లు అందుకుంటుందని వినికిడి. ఈ ఏడాది వస్తున్న ప్రాజెక్ట్ కి 1.5 నుండి 2 కోట్లు అందుకుంటున్న శ్రీలీల మహేష్, పవన్ కళ్యాణ్, విజయ్ దేవరకొండ సినిమాలకి 2 నుండి 3 కోట్ల దాకా పారితోషకం అందుకోబోతుందట.

కేవలం సినిమాలే కాకుండా అటు పలు ప్రొడక్ట్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గాను శ్రీలీల హ్యాండ్ రేజింగ్ లో ఉంది. అలా సినిమా పారితోషకాలు, రిబ్బన్ కటింగ్స్ అన్ని కలిపి ఓ 20 కోట్లు ఏడాదిలో శ్రీలీల వెనకేస్తుంది. నిజంగా సౌత్ లో ఏ హీరోయిన్ కి కూడా ఇది సాధ్యపడదేమో కదా.

Heroine earning 20 crores in one year:

Sreeleela earning 20 crores in one year
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs