Advertisement
Google Ads BL

గందరగోళంలో మహేష్ ఫాన్స్


మహేష్ బాబు ఫాన్స్ గందరగోళంలో కనిపిస్తున్నారు. కారణం గుంటూరు కారం విషయంలో ఏం జరుగుతుందో అర్ధం కాక కొట్టుకుంటుంటే.. త్రివిక్రం ఎక్కువగా అల్లు అర్జున్ తో కనిపించడం వాళ్లకి అస్సలు పాలుపోవడం లేదు. మహేష్ బాబు గుంటూరు కారం విషయం లో ఏమనుకుంటున్నారో తెలియడం లేదు. నిర్మాత నాగ వంశీ మౌనాన్ని వీడడం లేదు. గుంటూరు కారం టైటిల్ అండ్ గ్లిమ్ప్స్ తో అభిమానులు ఆనందపడినా.. ప్రస్తుతం షూటింగ్ విషయంలో, థమన్, పూజా హెగ్డే విషయంలో జరుగుతన్న ప్రచారానికి మరింత అయోమయంలోకి వెళుతున్నారు.

Advertisement
CJ Advs

ఈమధ్యనే మ్యూజిక్ డైరెక్టర్ థమన్ గుంటూరు కారం నుండి తప్పుకున్నారన్న వార్తవచ్చిన కొద్ది గంటల్లోనే హీరోయిన్ పూజ హెగ్డే గుంటూరు కారం నుండి అవుట్ అన్నారు. ఈలోపులో పూజ హెగ్డే ప్లేస్ లోకి నిధి అగర్వాల్ అయినా, ఫారియా అబ్దుల్లా అయినా రావొచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఇక జూన్ మొదటి వారంలో మొదలు కావాల్సిన కొత్త షెడ్యూల్ ఊసు ఇంతవరకు లేదు. రేపటి నుండి అంటే జూన్ 23 నుండి గుంటూరు కారం తదుపరి షెడ్యూల్ మొదలు అని సోషల్ మీడియాలో వినిపించడమే కానీ.. ఇప్పటివరకు అధికారిక ప్రకటన లేదు.

మరోపక్క మొదటి షెడ్యూల్ ని పక్కన పడినట్లుగానే రెండో షెడ్యూల్ ని కూడా పక్కనపడేశారనే వార్త మహేష్ అభిమానులని కలవరపెడుతుంది. అసలు ఒక్క సినిమా విషయంలో ఇన్ని రకాల వార్తలు గుప్పుమనడంతో ఫాన్స్ నలిగిపోతున్నారు. సరైన అప్ డేట్ ఇస్తేనే వారి మనసు కుదుటపడుతుంది. 

Mahesh fans in chaos:

Dispointed for Mahesh fans
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs