పవన్ కళ్యాణ్ రాజకీయాల వలన ఆయన నిర్మాతలు నష్టపోయారా అనిపించేలా ఆయన రాజకీయంగా చేస్తున్న వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వాన్ని రెచ్చగోట్టడం వలనే అప్పట్లో భీమ్లా నాయక్ సమయంలో జగన్ ప్రభుత్వం ఏపీలో టికెట్ రేట్స్ తగ్గించేసి నిర్మాతలని బాగా ఇబ్బంది పెట్టింది. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నుండి పోటీ చేసి గెలవడం అటుంచి.. ఆయన జగన్ పభుత్వంపై విరుచుకుపడుతున్నప్పుడల్లా ఆయన నటించే సినిమాలపై వైసీపీ ప్రభుత్వం తమ ప్రతాపాన్నిచూపిస్తుంది. భీమ్లా నాయక్ తెలంగాణాలో హిట్ అయినా.. ఏపీ లో ప్లాప్ అవడానికి కారణం టికెట్ రేట్స్ తగ్గించడమే.
అదే విషయాన్ని పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో పదే పదే చెబుతున్నారు. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితం తాజాగా విడుదలకు సిద్దమవుతున్న బ్రో పై కూడా ఎఫెక్ట్ పడే అవకాశం లేకపోలేదు. జులై 28 న విడుదల కాబోతున్న ఈ చిత్రంపై కూడా వైసీపీ ప్రభుత్వం కక్ష కడితే నిర్మాతలకి భారీ లాస్ రావడం ఖాయం. సముద్రఖని దర్శకత్వంలో పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ కాంబోలో తెరకెక్కిన బ్రో ద అవతార్ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీగా ఉంటే.. పవన్ కళ్యాణ్ ఏపీలో వారాహి యాత్రలో బిజీగా వున్నారు.
అయితే ప్రెజెంట్ ఆయన రాజకీయాల్లో చేస్తున్న వ్యాఖ్యలు బ్రోకి ముప్పు తెచ్చేవిలా ఉన్నాయంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అప్పట్లో భీమ్లా నాయక్ కి నష్టపోయినట్లుగా ఇప్పుడు బ్రో కి కష్టాలు తప్పేలా లేవు అంటూ మాట్లాడుకుంటున్నారు.