Advertisement
Google Ads BL

మహేష్-ప్రభాస్ నాకంటే పెద్ద హీరోలు: పవన్


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ఈ ఎన్నికల్లో బలమైన పార్టీగా నిలబెట్టాలని కృతనిశ్చయంతో కనిపిస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్స్ అన్ని పక్కనబెట్టి వారాహి యాత్ర చేపట్టారు. పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో ప్రజలు, ఆయన అభిమానులు వేలాదిగా పాలోంటున్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ముమ్మడివరం వారాహి యాత్రలో తన తోటి హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేసారు. తనకి చిరంజీవి గారు, రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ గార్లంటే చాలా ఇష్టం.. నా అభిమానులు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మా హీరో ఎక్కువ అంటే మా హీరో ఎక్కువ అని గొడవలు పడుతూ ఉంటారు. కానీ మేమంతా సినిమా వాళ్ళం. కనిపిస్తే మాట్లాడుకుంటాము. ఎవరి సినిమాలు వారు చేసుకుంటాము.

Advertisement
CJ Advs

బయట ఏ ఈవెంట్ లో కనిపించినా సరదాగా పలకరించుకుంటాము. మహేష్ గారు, ప్రభాస్ గారు నాకంటే పెద్ద హీరోలు. ప్రభాస్ గారు పాన్ ఇండియా హీరో. వారు నాకంటే ఎక్కువ పారితోషికం తీసుకుంటారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ గార్లు ఇప్పుడు గ్లోబల్ స్టార్స్ అయ్యారు. నేను వేరే రాష్ట్రాల్లో, దేశాల్లో తెలియకపోవచ్చు, కానీ వారు తెలుసు.. ఇది ఒప్పుకోవడానికి నాకు ఎలాంటి ఈగో లేదు. రాష్ట్ర క్షేమం కోసం అందరి హీరోల అభిమానులు నాకు, జనసేనకు అండగా నిలబడండి, మీ హీరోల సినిమాలు చూడండి, వాళ్ళని అభిమానించండి అంటూ పవన్ కళ్యాణ్ తన తోటి స్టార్ హీరోల అభిమానులకి రిక్వెస్ట్ చేసారు.

నిజంగా తన కన్నా వేరే హీరో గొప్ప అంటే లోపల ఈర్ష్య పడే హీరోలున్నా ఈరోజుల్లో పవన్ కళ్యాణ్ ఇలా ఓపెన్ గా తనకన్నా మహేష్, ప్రభాస్ లాంటి హీరోలు పెద్దవాళ్ళు, వాళ్ళే టాప్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళు గ్లోబల్ హీరోలు అంటూ మెచ్చుకోవడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తన తోటి హీరోలపై చేసిన వ్యాఖ్యలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అటు మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్ ఫాన్స్ ఫుల్ హ్యాపీ గా ఫీలవుతున్నారు. 

Pawan Kalyan comments on Prabhas and Mahesh:

Mahesh-Prabhas are bigger heroes than me: Pawan Kalyan
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs