Advertisement
Google Ads BL

ఆదిపురుష్ పై ప్రభాస్ డౌట్-ఓం రౌత్ అభయం


గత శుక్రవారం జూన్ 16 న విడుదలైన ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ థియేటర్స్ లో కిందా మీదా పడుతుంది. విడుదలకు ముందు ఉన్న అంచనాలు విడుదల తర్వాత లేవు. సినిమాకి నెగెటివ్ టాక్ చుట్టుముట్టడం, కాంట్రవర్సీలు ఎక్కువడడంతో ఆదిపురుష్ సినిమా కలెక్షన్స్ పరంగా బావుంది అంటున్నా.. అందరిలో ఎక్కడో ఏదో డౌట్. ప్రభాస్ రాఘవుడి కేరెక్టర్ లో బాలేదు, హనుమంతుడితో అలాంటి డైలాగ్స్ పలికిస్తారా, రావణాసురుడు ఏమిటి అలా ఉన్నాడు, సీత తో చెప్పించాల్సింది అలాంటి డైలాగ్సా.. గ్రాఫిక్స్ బాలేదు, ఓమ్ రౌత్ దర్శకత్వం బాలేదు ఇలా ఆదిపురుష్ ని విమర్శించినవాళ్ళే కానీ విమర్శించని వాళ్ళు లేరు.

Advertisement
CJ Advs

అయితే ప్రభాస్ ఆదిపురుష్ స్టార్ట్ అయినప్పుడు అసలు ఇది వర్కౌట్ అవుతుందా అని భయపడ్డాడట. ఆదిపురుష్ షూటింగ్ లో పాల్గొన్న ప్రభాస్ నాలుగు రోజులపాటు షూటింగ్ చేసాక.. అనుమానమొచ్చి.. నేను ఈ సినిమా చెయ్యొచ్చా.. ఎదుకంటే ఇలాంటి పాత్ర నేను ఇంతకు ముందు చెయ్యలేదు. ఇతర సినిమాల విషయంలో తప్పు జరిగినా పర్లేదు, కానీ ఆదిపురుష్ విషయంలో తప్పు జరక్కూడదు..

ఇది భక్తితో కూడిన సినిమా అంటూ ప్రభాస్ ఓమ్ రౌత్ ని పక్కకి  పిలిచి అడిగాడట, ఓమ్ రౌత్ కూడా ఎలాంటి భయాలు పెట్టుకోవద్దు నేనున్నాను అంటూ అభయమిచ్చాడంటూ ప్రభాస్ ఒకొనొక సందర్భంలో కాదు.. రాధే శ్యామ్ ఇంటర్వ్యూలో చెప్పిన వీడియోస్ ఇప్పుడు ప్రభాస్ ఫాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ.. ప్రభాస్ కి అంత అనుమానం ఉన్నప్పుడు ఓమ్ రౌత్ ఆదిపురుష్ చెయ్యకుండా ఉండాల్సింది అంటూ ఓమ్ రౌత్ ని టార్గెట్ చేస్తున్నారు.

Prabhas On Adipurush Mistakes:

Prabhas on portraying Lord Ram in Adipurush
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs