Advertisement
Google Ads BL

దేవరలో ఆ సీన్ చూస్తే గూస్ బంప్స్ ఖాయమట


యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల కాంబోలో తెరకెక్కుతున్న క్రేజీ ప్యాన్ ఇండియా ఫిల్మ్ దేవర షూటింగ్ శరవేగంగా జరిగిపోతుంది. సైఫ్ అలీ ఖాన్ ఎన్టీఆర్ తో తలపడనున్న పవర్ ఫుల్ విలన్ గా కనిపిస్తున్నారు. దేవరలో సైఫ్ కి మొదటి భర్య కుమార్తెగా జాన్వీ కపూర్ కనిపించబోతుందని తెలుస్తుంది. జాన్వీ కపూర్ పాత్ర చివరి వరకు సస్పెన్స్ గానే ఉంచబోతున్నారట. ఇక ఇప్పటికే రెండు పవర్ ఫుల్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించిన కొరటాల ఇప్పుడు మరో కీలక ఫైట్ ని తెరకెక్కించబోతున్నారట.

Advertisement
CJ Advs

ఈ యాక్షన్ సన్నివేశం చూస్తే ఫాన్స్ కి గూస్ బంప్స్ రావడం పక్కా అంటున్నారు. ఈ యాక్షన్ సీన్ చాలా రిస్క్ తో కూడుకున్నదని.. ఈ సీన్ లో ఎన్టీఆర్ ఎలాంటి డూప్ లేకుండా సముద్రపు అడుగున ఫైట్ చేస్తాడని తెలుస్తుంది. కేవలం ఎన్టీఆర్ ఫాన్స్ కే కాదు.. మాస్ ఆడియన్స్ అందరికి ఈ యాక్షన్ సీక్వెన్స్ చూడగానే ఒళ్ళు గగుర్పొడవడం ఖాయమని చెబుతున్నారు. ఈ యాక్షన్ సీక్వెన్స్ దేవర కే హైలెట్ కానుందని సమాచారం.

అంతేకాకుండా అభిమానులకి పిచ్చెక్కపోయే బిగ్ ట్విస్ట్ కూడా దేవరలో ఉండబోతుందట. ఆ ట్విస్ట్ జాన్వీ కపూర్ రోల్ కి ముడిపడి ఉంటుంది అని తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్-కొరటాల ఎలాంటి గ్యాప్ లేకుండా దేవర చిత్ర షూటింగ్ ని పరుగులు పెట్టిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 5 2024 లో ప్యాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

Devara: NTR risk at the bottom of the ocean:

Devara: Under Water Fight Major Highlight in This Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs