యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఆర్.ఆర్.ఆర్ తర్వాత గ్లోబల్ స్థాయిలో పెరిగిన ఇమేజ్ ని ఆయన మెల్లగా క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు. టాలీవుడ్ హీరోల్లో మహేష్ బాబు చాలా ప్రొడక్ట్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయి పలు యాడ్ షూట్స్ చేస్తారు. ఆయన నటించే సినిమాలు ఏడాదికో, రెండేళ్లకో ఒకటి రిలీజ్ అయితే ఈమద్యలో ఆయన నుండి నాలుగైదు ప్రొడక్ట్స్ బయటికి వస్తాయి. ఎందులో చూసినా మహేష్ మాత్రమే కనిపిస్తారు. ఆ తర్వాత అల్లు అర్జున్ ఇదే రేంజ్ లో దూసుకుపోతూ ఉంటారు. పుష్ప తర్వాత అల్లు అర్జున్ మార్కెట్ కూడా పెరగడంతో ఆయన ఖాతాలో పలు ప్రొడక్ట్స్ వచ్చి చేరాయి.
ఇక రామ్ చరణ్, ఎన్టీఆర్ కాస్త తక్కువగానే బ్రాండ్స్ ని సెలెక్ట్ చేసుకుంటారు. ఆర్.ఆర్.ఆర్ హిట్ తర్వాత ఎన్టీఆర్ లీసియస్ బ్రాండ్ కి అంబాసిడర్ గా మారిపోయారు. రీసెంట్ గా మెక్ డొనాల్డ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా యాడ్ షూట్ చేశారు. తాజాగా ఎన్టీఆర్ ఖాతాలోకి మరో బ్రాండ్ చేరింది.
అదే మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ బ్రాండ్. ఈ జ్యువలరీని ప్రమోట్ చేసేందుకు గాను ఎన్టీఆర్ దానికి సంబందించిన యాడ్ షూట్ లో పాల్గొన్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ యాడ్ షూట్ పిక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.