మహేష్ బాబు-త్రివిక్రమ్ ల గుంటూరు కారం షూటింగ్ విషయంలో అసలేం జరుగుతుందో అర్ధం కాక మహేష్ అభిమానులు అయోమయంలో ఉన్నారు. నిన్న ఒక్కసారిగా గుంటూరు కారం సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది. కారణం SS థమన్ ని గుంటూరు కారం మ్యూజిక్ డైరెక్టర్ గా తప్పించారంటూ ఓ న్యూస్ హైలెట్ అయ్యింది. థమన్ ప్లేస్ లోకి అనిరుధ్ వచ్చేశాడంటూ రాసేశారు. ఆ తర్వాత థమన్ ఈ రూమర్స్ పై సెటేరికల్ గా స్పందించాడు. మరోపక్క హీరోయిన్ పూజ హెగ్డే గుంటూరు కారం నుండి అవుట్.. శ్రీలీల నే హీరోయిన్ గా ఫిక్స్ చేసారంటూ మరో వార్త తాజాగా బయటికి వచ్చింది.
అయితే ఇదంతా చూస్తున్న మహేష్ ఫాన్స్ లో గందర గోళం మొదలైంది. ఈ లోపులో ఓ అభిమాని సోషల్ మీడియాలో.. మహేష్ బాబు గుంటూరు కారం సినిమా నుంచి తమన్ ని తప్పిస్తున్నారు అనే మాట అవాస్తవం... ఈ నెల 24 నుంచి గుంటూరు కారం కొత్త షెడ్యూల్ షూటింగ్.. జనవరి 13న రిలీజ్.. ఒకవేళ అదే రోజు ప్రభాస్ ప్రాజెక్ట్ K ఉంటే మాత్రం ఒక రోజు ముందుగానే గుంటూరు కారం రిలీజ్.. అంటూ చేసిన ట్వీట్ కి నిర్మాత నాగ వంశీ థంబ్ చూపిస్తూ రిప్లై ఇవ్వడంతో థమన్ విషయం జస్ట్ రూమర్ అని తేలిపోయింది.
కానీ హీరోయిన్ గా పూజా హెగ్డే అయితే ఈ సినిమా నుంచి తప్పుకున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. అయితే పూజ హెగ్డే ని త్రివిక్రమ్ తప్పించారా.. లేదంటే శ్రీలీల డామినేషన్ ముందు తన కేరెక్టర్ వీక్ అవుతుంది అని పూజా హెగ్డేనే తప్పుకుందా అనేది తెలియాల్సి ఉంది.