Advertisement
Google Ads BL

మెగా ప్రిన్సెస్.. మెగాస్టార్‌కి మనవరాలు


రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఓ బేబీ గాళ్‌కు జన్మినిచ్చారు. మంగళవారం ఉదయం ఉపాసన ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు పాప పుట్టినట్లుగా అపోలో హాస్పిటల్ డాక్టర్లు అధికారికంగా ఓ ప్రకటనను విడుదల చేశారు. దీంతో మెగా ఇంట సంబరాలు మొదలయ్యాయి. దాదాపు పెళ్లయిన 10 సంవత్సరాల తర్వాత రామ్ చరణ్, ఉపాసన దంపతులు పేరేంట్స్‌గా ప్రమోషన్ పొందడంతో.. మెగా ఇంట్లోనూ, మెగా ఫ్యాన్స్‌లోనూ సంబరాలు అంబరాన్నంటాయి. ఈ వార్త కోసం అందరూ ఎంతగానో ఎదురు చూశారు. 

Advertisement
CJ Advs

ఇక ఉపాసన ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటి నుంచి.. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతూ వస్తున్నారో కూడా చూస్తూనే ఉన్నాం. మా అన్న, వదిన అంటూ చరణ్, ఉపాసనల గురించి రోజూ ఏదో విధంగా మెగా ఫ్యాన్స్ సందడి చేస్తూనే ఉన్నారు. అలాగే ఉపాసన కూడా తనకు పుట్టబోయే బిడ్డ కోసం తీసుకున్న జాగ్రత్తలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వారిని పెంచే విధానంలో ఆమె తీసుకున్న నిర్ణయం, బేబీ షవర్ సెలబ్రేషన్స్, ప్రముఖుల బ్లెసింగ్స్.. ఇలా ఏదో ఒక రూపంలో నిత్యం ఉపాసన, రామ్ చరణ్ దంపతులు వార్తలలో ఉంటూనే వచ్చారు. ఈ క్రమంలో వారికి పుట్టబోయే బిడ్డ పాపే అనేలా కూడా వార్తలు వచ్చాయి. ఆ వార్తలే ఇప్పుడు నిజం అయ్యాయి. 

సోమవారం సాయంత్రం చరణ్, ఉప్సీ దంపతులు అపోలో హాస్పిటల్‌కి చేరుకున్నట్లుగా వార్తలు రావడంతో.. గుడ్ న్యూస్ వినడం కోసం తెల్లవార్లు ఫ్యాన్స్ వెయిట్ చేస్తూనే ఉన్నారు. మెగాస్టార్ ఇంట్లోకి మెగా ప్రిన్సెస్ రాబోతోందని తెలిసిన తర్వాత.. ఎవరైతే ఏంటి? మెగా వారసురాలికి స్వాగతం, సుస్వాగతం అంటూ లిటిల్ ప్రిన్సెస్‌ని ఘనంగా వారు స్వాగతిస్తున్నారు. ప్రస్తుతం అపోలో హాస్పిటల్‌లో తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నట్లుగా డాక్టర్లు తెలిపారు. మెగా ప్రిన్సెస్‌ని చూసేందుకు మెగా ఫ్యామిలీతో పాటు బంధువులందరూ అపోలో హాస్పిటల్‌కి చేరుకుంటున్నారు. మరి ఈ అపురూపమైన క్షణాలపై మెగాస్టార్ చిరంజీవి రియాక్షన్ ఎలా ఉండబోతుందో.. చూడాలి. 

Ram Charan and Upasana Had a Baby Girl:

Grand Welcome to Mega Princess From Mega Family
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs