ప్రభాస్-ఓం రౌత్ కలయికలో టీ సీరీస్ నిర్మించిన ఆదిపురుష్ గత శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాలు నడుమ భారీగా అంటే ప్రపంచ వ్యాప్తంగా 9000 వేల స్క్రీన్స్ లో విడుదలైన ఆదిపురుష్ మూవీకి ఫస్ట్ షోకే నెగెటివ్ టాక్ రావడమే కాదు.. ప్యాన్ ఇండియాలోని ప్రేక్షకులు సినిమాని చీల్చి చెండాడుతున్నారు. పబ్లిక్ నుండి ఎలాంటి ఇంట్రస్టింగ్ టాక్ రాలేదు. నార్త్ ఆడియన్స్, తమిళ, కన్నడ, మలయాళ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని పూర్తిగా తిరస్కరించారు. తెలుగులో మాత్రమే ఆదిపురుష్ కి మిక్స్డ్ రెస్పాన్స్ కనిపించింది.
ఆదిపురుష్ పై వస్తున్న నెగెటివ్ టాక్ ని మేకర్స్ తిప్పికొట్టేందుకు సకల ప్రయత్నాలు చేస్తున్నారు. ఆదిపురుష్ పై ట్రోల్స్, మీమ్స్ అన్ని సోషల్ మీడియాలో ఎక్కువైపోతున్నాయి. ఇంత నెగెటివ్ పబ్లిసిటీ, నెగిటివిటీని తట్టుకుంటున్న ఆదిపురుష్ మూడు రోజుల్లో మూడు వందల కోట్లు సాధ్యమేనా. మొదటిరోజు అంటే టాక్ తో సంబంధం లేకుండా అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ ఉంటాయి కాబట్టి 140 కోట్లు కొల్లగొట్టింది ఆదిపురుష్. ఆ తర్వాత శనివారం 100కోట్లు, ఆదివారం 100 కోట్లు కలెక్షన్స్ ఇచ్చింది.
మరి ఫస్ట్ వీకెండ్ లో ఇలా 340 కోట్లు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఆదిపురుష్ కలెక్ట్ చెయ్యడం నిజంగా మేకర్స్ అదృష్టమనే చెప్పాలి. ఇక ఈరోజు నుండి ఆదిపురుష్ పనైపోతుంది. మండే కి అడ్వాన్స్ బుకింగ్స్ ఉండవు. అలాగని ప్రత్యేకంగా సినిమా థియేటర్ కి వెళ్ళరు. వర్కింగ్ డే రోజున ప్లాప్ సినిమాకి కలెక్షన్స్ లెక్కేసుకోవడం అత్యాశే అవుతుంది. మరోపక్క ఆదిపురుష్ కి మూడు రోజుల్లో 340 కోట్లు సాధ్యమేనా.. ఇదేమన్నా మేకర్స్ మాయా అంటూ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు.
ఆదిపురుష్ మేకర్స్ కావాలనే తప్పుడు లెక్కలు చూపుతూ పోస్టర్స్ వేస్తున్నారు. ఆదిపురుష్ కి ఇంత పెద్ద మొత్తంలో కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ లేదు అంటూ ప్రభాస్ యాంటీ ఫాన్స్ ట్రోల్స్ కూడా మొదలు పెట్టారు.