Advertisement
Google Ads BL

ఉపాసన కోసం రామ్ చరణ్ నిర్ణయం


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ తో చేస్తున్న ప్యాన్ ఇండియా ఫిల్మ్ గేమ్ ఛేంజర్ షూటింగ్ లో మరీ బిజీగా లేకపోయినా.. ఇతర బిజినెస్ వ్యవహారాలతో కాస్త బిజీగానే గడుపుతున్నాడు. శంకర్ అటు కమల్ హాసన్ ఇండియన్ 2 ఇటు, ఇటు రామ్ చరణ్ తో గేమ్ ఛేంజర్ మూవీస్ చేస్తూ ఉండడంతో రామ్ చరణ్ కి గ్యాప్ లు దొరుకుతున్నాయి. ఈ సమయంలో రామ్ చరణ్ ఎక్కువగా భార్య ఉపాసనతో టైమ్ స్పెండ్ చేస్తున్నాడు. ఆమె ఇప్పుడు తొమ్మిది నెలల ప్రెగ్నెంట్.  పదకొండేళ్ల కి ఉపాసన ప్రెగ్నెంట్ అవడంతో ఇరు ఫామిలీస్ మెగా వారసుడి కోసం తెగ వెయిట్ చేస్తున్నాయి.

Advertisement
CJ Advs

అయితే రామ్ చరణ్ ఇప్పుడు తన భార్య కోసం ఓ నిర్ణయం తీసుకున్నాడట. అది ఆమె డెలివరీ వరకు షూటింగ్ అంటూ బయటికి వెళ్లిపోకుండా ఉపాసన చెంతనే ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడట. ఉపాసనకి జులై మొదటి వారంలో డెలివరీకి డేట్ ఇవ్వడంతో రామ్ చరణ్ ఇప్పటినుండి ఉపాసనతోనే ఉండాలని నిర్ణయం తీసుకుని శంకర్ తో చేస్తున్న గేమ్ ఛేంజర్ షూటింగ్ కి జులై నెల, ఆగష్టు ఇలా రెండు నెలల బ్రేక్ తీసుకుంటున్నాడని తెలుస్తుంది. ఇప్పటికే ఉపాసన డాక్టర్స్ ఆధ్వర్యంలోనే ఉండడంతో రామ్ చరణ్ కూడా ఇకపై ఆమె పక్కన ఉండేలా చూసుకుంటున్నాడట.

ఎక్కువ సమయాన్ని భార్య తో గపడానికి చరణ్ ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తుంది. ఇక ఈ మధ్యన ఉపాసన తమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా తాము బిడ్డ పుట్టగానే అత్తారింటికి వెళ్లిపోతామని.. తమ బిడ్డకి గ్రాండ్ పేరెంట్స్ ప్రేమ, క్రమ శిక్షణ అన్నీ కావాలంటూ చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా చరణ్-ఉపాసనలు మెగా హౌస్ కి షిఫ్ట్ అయినట్లుగా తెలుస్తుంది.

Ram Charan decision for Upasana:

Upasana, Ram Charan To Move Back With Chiru and Surekha!
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs