Advertisement
Google Ads BL

అందుకే విష్ణుప్రియ నాతో పెళ్లి అంది: JD


బుల్లితెరపై యాంకర్‌గా పెద్ద పెద్దగా అరుస్తూ ఫేమస్ అయిన భామ విష్ణుప్రియ. విష్ణుప్రియపై జబర్ధస్త్ కమెడియన్స్ ఎలా కౌంటర్స్ వేస్తుంటారో తెలియని విషయం కాదు. అలాగే విష్ణుప్రియలో మంచి డ్యాన్సింగ్ టాలెంట్ కూడా ఉంది. సోషల్ మీడియాలో హాట్ హాట్‌గా కనిపిస్తూ.. డ్యాన్స్ చేస్తున్న వీడియోలను ఆమె తరుచుగా పోస్ట్ చేస్తుండటం, అవి కాస్తా వైరల్ అవుతుండటంతో.. ఆమె మంచి నేమ్‌నే సొంతం చేసుకుంది. అలాంటి విష్ణుప్రియ.. రీసెంట్‌గా సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి ప్రేమలో పడిపోయింది. జేడీ వాళ్ల మదర్ ఓకే అంటే.. ఆయనని పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధం అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చేసింది. ఇంకేముంది.. జేడీతో విష్ణుప్రియ పెళ్లి అంటూ ఒకటే వార్తలు. ఇదిలా ఉంటే విష్ణుప్రియ స్టేట్‌మెంట్‌పై జేడీ ఏమన్నారో తెలిస్తే అంతా షాకవుతారు. 

Advertisement
CJ Advs

40రోజులు కలిసున్నాం.. అందుకే విష్ణుప్రియ అలా అంది.. అని తాజాగా జేడీ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. షాకయ్యారా? అవును మరి.. 40 రోజులు కలిసున్నాం.. అని చెబితే ఎవరైనా షాక్ అవుతారు. కానీ ఇక్కడ కలిసుంది విష్ణుప్రియ, జేడీ మాత్రమే కాదు.. వీరిద్దరూ కలిసి ఓ వెబ్ సిరీస్ చేశారు. ఆ యూనిట్‌తో వీళ్లు 40 రోజుల పాటు ట్రావెల్ అయ్యారు. ఈ ట్రావెల్‌లో ఆ వెబ్ సిరీస్ దర్శకుడు.. విష్ణుప్రియను జేడీ చక్రవర్తి నటించిన సినిమాలన్నింటినీ చూడమని సలహా ఇచ్చాడట. ప్రతిరోజూ ఆమె జేడీ నటించిన ఒక సినిమా చూస్తూ.. అందులోని పాత్రలతో విష్ణుప్రియ ప్రేమలో పడిపోయిందట. ఈ విషయం స్వయంగా జేడీనే చెప్పుకొచ్చాడు. 

విష్ణుప్రియ ప్రేమించింది నన్ను కాదు.. నేను చేసిన పాత్రలని. అంతే.. ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయి. మా మధ్య గురు, శిష్యుల బంధమే తప్ప.. మరొకటి లేదు అని తాజాగా జేడీ క్లారిటీ ఇచ్చారు. పవన్ సాధినేని దర్శకత్వంలో రూపొందుతోన్న ‘దయ’ అనే వెబ్ సిరీస్‌లో జేడీ చక్రవర్తి, విష్ణుప్రియ నటిస్తున్నారు. ఈ సిరీస్‌ త్వరలోనే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. అయితే.. ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అని కూడా కొందరు కామెంట్స్ చేస్తుండటం విశేషం.

JD Chakravarthy Clarity on Vishnu Priya Marriage Statement:

JD Chakravarhty Reacted on Vishnu Priya Comments
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs