Advertisement
Google Ads BL

గుంటూరు కారం సంక్రాంతి బరిలో లేనట్టేనా?


మహేష్ బాబు-త్రివికమ్ కాంబోలో హ్యాట్రిక్ మూవీగా తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల అంటూ మార్చి లోనే డేట్ ఇచ్చి పోస్టర్ వేశారు. అయితే గుంటూరు కారం మొదలైనప్పటి నుండి ఆ సినిమా షూటింగ్స్ కి బ్రేకులు మీద బ్రేకులు పడుతూనే ఉన్నాయి. గత ఏడాది సెప్టెంబర్‌లో మొదలైన ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఒక్క షెడ్యూల్ ముగియగానే మహేష్ పర్సనల్ లాస్‌తో సఫర్ అవడంతో షూటింగ్ దాదాపుగా నాలుగు నెలలపాటు వాయిదా పడింది.

Advertisement
CJ Advs

ఎలాగో జనవరి చివరి వారంలో కొత్త షెడ్యూల్‌తో పట్టాలెక్కించి త్రివిక్రమ్-మహేష్‌లు రెండు నెలలపాటు షూటింగ్‌ని బాగానే చేశారు. ఈలోపులో సినిమా రిలీజ్ డేట్‌ని గ్రాండ్‌గా ఫస్ట్ లుక్ పోస్టర్ వేసి ప్రకటించారు. ఇక ఏప్రిల్ రెండో వారంలో మహేష్ బాబు షూటింగ్‌కి ప్యాకప్ చెప్పి విదేశాలకు వెళ్లేందుకు ఫ్లైట్ ఎక్కాడు. మధ్యలో అంటే మే చివరిలో వచ్చాడు. ఆ తర్వాత ఇదిగో, అదిగో గుంటూరు కారం షూటింగ్ మొదలవుతుంది అని డేట్స్ ఇవ్వడమేకాని.. పట్టాలెక్కిన సందర్భం కనిపించడం లేదు. జూన్ 6 కొత్త షెడ్యూల్ అన్నారు, కాదు 10 అన్నారు.. లేదు 16 నుండి మొదలవుతుంది అన్నారు.

కానీ మూడు తేదీలు వెళ్ళిపోయినా.. గుంటూరు కారం కొత్త షెడ్యూల్ కబురులేదు. మే 31న కృష్ణగారి వర్ధంతికి గుంటూరు కారం టైటిల్, గ్లింప్స్‌తో ఫాన్స్‌ని ఇంప్రెస్ చేశారు. రీసెంట్‌గా శ్రీలీల పుట్టిన రోజుకి ఆమె లుక్ విడుదల చేశారు. మరి ఇప్పుడు షూటింగ్‌పై క్లారిటీ లేకపోవడంతో వచ్చే సంక్రాంతికి గుంటూరు కారం విడుదల అవ్వకపోవచ్చనే ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.. దీనిపై నిర్మాత నాగ వంశీ ఏమంటారో చూడాలి.

Doubts on Guntur Karam Release :

News on Mahesh Babu Guntur Karam Movie 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs