Advertisement
Google Ads BL

మిల్కీబ్యూటీ మరీ ఇలా తయారైందేంటి?


కొన్ని రోజులుగా మిల్కీబ్యూటీ తమన్నా పేరు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అందుకు కారణం ఆమె సోషల్ మీడియాలో పెట్టే ఫొటోలలోనే కాకుండా.. సినిమాలో చేసే సీన్స్ విషయంలో కూడా హద్దులేం లేవనేలా యాక్ట్ చేయడమే. అలాగే తన బాయ్‌ఫ్రెండ్‌ విషయంలో కూడా తమన్నా టాక్ ఆఫ్ ద సోషల్ మీడియా అవుతోంది. అవకాశాలు లేవు, రావడం లేదు అనుకునే వారికి.. షాకిచ్చేలా.. సినిమాలు, వెబ్ సిరీస్‌లతో తమన్నా తెగ హడావుడి చేస్తుంది.

Advertisement
CJ Advs

ఈ క్రమంలో తాజాగా ఆమె నటించిన జీ కర్దా వెబ్‌ సిరీస్‌లో అందాల ఆరబోతలో హద్దులు దాటిందనే విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. సినీ రంగంలోకి అడుగుపెట్టిన కొత్తల్లో ఎంతో సంప్రదాయంగా నటించిన తమన్నా.. ఇప్పటి వరకు లిప్‌లాక్‌, శృంగార సన్నివేశాలకు దూరంగా ఉంటూ వచ్చింది. కానీ, తాజాగా జీ కర్దా వెబ్‌ సిరీస్‌లో తన ప్రేమను సాధించుకునేందుకు పోరాడే మహిళ పాత్రలో నటించిన తమన్నా.., ఇందులో అశ్విన్‌ గులాటితో పడక సన్నివేశాలలో రెచ్చిపోయి యాక్ట్ చేసింది. ఈ వెబ్ సిరీస్ చూసిన ప్రేక్షకులు, సినీ ప్రముఖులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటి వరకు ముద్దు సన్నివేశాల్లో కూడా నటించేందుకు వెనుకంజ వేసిన తమన్నా.. ఈ వెబ్‌ సిరీస్‌లో ఈ విధంగా నటించడం ప్రతి ఒక్కరినీ విస్మయానికి గురిచేస్తోంది. అలాగే లస్ట్ స్టోరీస్ 2లో కూడా తమన్నా.. శృంగార సన్నివేశాల్లో నటించినట్లుగా ఇప్పటికే విడుదలైన టీజర్ చెప్పేస్తోంది. మరో వైపు బాయ్ ఫ్రెండ్‌తో పబ్లిగ్గా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది. ఇవన్నీ చూసిన వారంతా.. తమన్నా తెగించేసింది అంటూ కామెంట్స్ చేస్తుండటం విశేషం. ఈ తెగింపు ఏ రేంజ్‌లో ఉందంటే.. తాజాగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలు సృష్టిస్తోన్న సంచలనాన్ని గమనిస్తే తెలిసిపోతుంది. తాజాగా ఆమె కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో హాట్ హాట్‌గా తమన్నా కనిపించడంతో ఫ్యాన్స్, నెటిజన్లు పిచ్చపిచ్చగా లైక్స్ కొడుతూ.. షేర్ చేస్తున్నారు. 

Tamannaah Bhatia New Photoshoot Pics Goes Viral:

Again Tamannaah Bhatia in News with New Photos
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs