టాలీవుడ్‌లో హీరోల ఫ్యాన్స్ మధ్య వార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగా ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్, నందమూరి ఫ్యాన్స్, మహేష్ ఫ్యాన్స్ ఇలా ఒక హీరో ఫ్యాన్స్.. మరో హీరో ఫ్యాన్స్‌ని దూషించడం, కొట్టడం అనేది.. సోషల్ మీడియా వేదికగా రోజూ జరుగుతూనే ఉంది. హీరోలందరూ మేం ఇండస్ట్రీలో స్నేహితుల్లా ఉంటామని పలు సందర్భాలలో క్లారిటీ ఇచ్చినా కూడా.. వారి ఫ్యాన్స్ మధ్య మాత్రం గొడవలు కామనే అనేలా మారిపోయాయి. కానీ ఇప్పుడు హీరోల ఫ్యాన్స్‌పై రాజకీయ పార్టీకి చెందిన కార్యకర్తలు తిరగబడితే.. ఇలాంటి సంఘటనే తాజాగా చోటుచేసుకుంది.
సూళ్లూరుపేటలోని రాఘవయ్య పేటకు చెందిన ఎన్టీఆర్ అభిమానులపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. రాఘవయ్య పేటకు చెందిన వెంకటేష్ యాదవ్, సునీల్ యాదవ్ ఎన్టీఆర్‌కి వీరాభిమానులు. తారక్ ఫౌండేషన్ పేరిట పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. అలాగే టీడీపీ కార్యకలాపాలలో కూడా వారు చురుకుగా పాల్లొంటూ ఉండటంతో.. వారికి మంచి ఫాలోయింగ్, జనాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు పెరుగుతూ వస్తున్నాయి. ఇది సహించుకోలేని కొందరు వైసీపీ దుండగులు శనివారం వారిపై దాడికి తెగబడ్డారు.
ఆరు నెలల క్రితం వెంకటేష్‌పై దాడి చేసిన దుండగలు.. శనివారం సాయంత్రం సునీల్ వెళుతున్న మార్గంలో తోపులాటకి దిగారు. ఆ తోపులాటలో గాయపడిన సునీల్ ఇంటికెళ్లిన తర్వాత.. 10 మంది వైసీపీ కార్యకర్తలు రాత్రికి మళ్లీ ఇంటిపై దాడి చేశారు. అదే సమయంలో వెంకటేష్ కూడా రావడంతో.. వెంకటేష్, సునీల్‌పై కత్తులు, రాడ్లతో వారు దాడి చేయగా.. ఈ దాడిలో వెంకటేష్ తీవ్రంగా గాయపడినట్లుగా తెలుస్తోంది. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో.. నెల్లూరు హాస్పిటల్‌కు తరలించినట్లుగా సమాచారం. సునీల్‌కు కూడా తీవ్రంగానే గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లుగా తెలిపారు.