Advertisement
Google Ads BL

మెల్లగా జబర్దస్త్‌లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు


సినిమా అవకాశాల కోసమని, పక్క ఛానల్స్‌లో పారితోషకాలు ఎక్కువని ఈటీవీ జబర్దస్త్‌లో ఫేమస్ అయ్యాక బయటికి వెళ్ళిపోయి.. కొన్నాళ్ళు కిందా మీద పడి చివరికి జబర్దస్త్‌లోకి రీ ఏంట్రీ ఇస్తున్నారు పలువురు కమెడియన్స్. జబర్దస్త్‌లో రాజకీయాలున్నాయని, అక్కడ ఫుడ్ బాగోదంటూ నానా మాటలన్న వారు జబర్దస్త్‌కి రీ ఎంట్రీ ఇచ్చే సాహసం చెయ్యకపోయినా.. మిగతా వారు బయట ఛానల్స్‌లో పని దొరక్క, సినిమాల్లో మనుగడలేక మళ్ళీ జబర్దస్త్‌నే నమ్ముకుని రీ ఎంట్రీకి సిద్ధమయ్యారు. 

Advertisement
CJ Advs

ఇప్పటికే షకలక శంకర్, సుధాకర్.. ఇప్పుడు జబర్దస్త్ మహేష్, ఇంకా చాలామంది రీ ఎంట్రీ ఇస్తున్నారు, ఇచ్చేశారు కూడా. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్‌లో వేరే టీం లీడర్లు కింద వీరు కామెడీ చేసుకుంటున్నారు. వీళ్లంతా సినిమా అవకాశాల కోసం, పక్క ఛానల్స్ పెంచి ఇస్తామన్న పారితోషకాల కోసం వెళ్లి వచ్చిన కమెడియన్స్. జబర్దస్త్ మహేష్ సినిమాల్లో నిలదొక్కుకున్నాడు. హీరోలకి సపోర్టింగ్ రోల్స్‌లో సత్తా చాటాటు. మరి మహేష్ సడన్‌గా మళ్ళీ ఎందుకు జబర్దస్త్‌కి రీ ఎంట్రీ ఇచ్చాడో తెలియదు. ఇక షకలక శంకర్ మాత్రం హీరోగా వెండితెర మీద వెలిగిపోదామనుకున్నాడు. స్టార్ హీరోల సినిమాల్లో కామెడీ చేద్దామనుకున్నాడు. కానీ ఈ మధ్యన అతనికి అవకాశాలు తగ్గాయి. అందుకే మళ్ళీ జబర్దస్త్‌ని నమ్ముకుందామని రీ ఎంట్రీ ఇచ్చినట్టుగా ఉన్నాడు.

ఇక లేడీ గెటప్ సుధాకర్ జబర్దస్త్ నుండి వెళ్ళాక మళ్ళీ ఎక్కడా కనిపించలేదు. ఇన్నాళ్లకు ఇప్పుడు రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇక అదిరే అభి, చలాకీ చంటి లాంటి వాళ్ళు కూడా జబర్దస్త్‌కి దూరంగా ఉంటున్నారు. త్వరలోనే వాళ్ళు రీ ఎంట్రీ ఇవ్వొచ్చనేలా వార్తలు వినిపిస్తున్నాయి. సుధీర్, ఆది లాంటి వాళ్ళు ప్రస్తుతం వెండితెరపై వెలిగిపోతున్నారు. వాళ్ళు ఇకపై జబర్దస్త్‌లో కనిపించకపోయినా ఆశ్చర్యపడక్కర్లేదు అంటున్నారు.

Comedians Slowly re-entering to Jabardasth:

Again Comedian Mahesh Re enters in Jabardasth
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs