Advertisement
Google Ads BL

ఆదిపురుష్ ఓపెనింగ్స్ సునామి


ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీఖాన్ నటించిన ఆదిపురుష్ సినిమా జూన్ 16 న విడుదలైంది. అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ల తోనే బాక్సాఫీస్ వద్ద భారీ తుఫాను సృష్టించిన ఈ సినిమా గ్లోబల్ బాక్స్ ఆఫీస్ వద్ద ₹140 కోట్లతో అద్భుతమైన ఓపెనింగ్ డే రెస్పాన్స్‌ని అందుకుంది. బిజినెస్ పరంగా కూడా ఆదిపురుష్ మొదటి రోజు బాక్సాఫీస్ ను షేక్ చేసింది. టాప్ 5 లో నిలిచిన ఏకైక హిందీ చిత్రంగా రికార్డ్ సృష్టించింది ఈ సినిమా.

Advertisement
CJ Advs

అన్నీ షోస్ హౌస్‌ఫుల్‌ గా నడుస్తుండడంతో, ఆదిపురుష్ అన్ని వయసుల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అద్భుతమైన కథాంశం మరియు కథను మన ముందుకు తెచ్చిన విధానం అందరినీ మంత్రముగ్ధులను చేస్తోంది. ప్రతి ఫ్రేమ్‌ తో పిల్లలకు మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తోంది ఈ సినిమా. ఈ మాగ్నమ్ ఓపస్ ఒక విజువల్ ట్రీట్ గా మొదటి నుండి చివరి వరకు యువత ను కట్టిపడేస్తుంది. అందరికీ ఒక మరపురాని అనుభూతిని కలిగిస్తున్న ఈ చిత్రం కలెక్షన్ల పరంగా కూడా స్ట్రాంగ్ గా కొనసాగుతూ ప్రపంచవ్యాప్తంగా కూడా రికార్డులు సృష్టిస్తోంది.

ఆదిపురుష్ సినిమా కి ఓం రౌత్ దర్శకత్వం వహించారు మరియు T-సిరీస్, భూషణ్ కుమార్ & క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్ మరియు రెట్రో ఫైల్స్‌కు చెందిన రాజేష్ నాయర్ మరియు UV క్రియేషన్స్‌పై వంశీ, ప్రమోద్ సంయుక్తంగా నిర్మించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది.

Adipurush Surprises With Biggest Opening :

Adipurush earns Rs 140 crores globally on Day 1
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs