ప్రభాస్ అంటే ప్రాణం పెట్టే అభిమానులు ఉంటారు. అందుకే.. ఆదిపురుష్ కి అంతగా ప్రమోషన్స్ లేకపోయినా ఓపెనింగ్స్ అదిరిపోయాయి. రాముడి మహిమో.. ప్రభాస్ మాయో కానీ ఆదిపురుష్ ఓపెనింగ్స్ ఇరక్కొట్టేశాయి. కానీ సినిమా విడుదలకు ముందు ఉన్న ఊపు విడుదలయ్యాక లేదు. సినిమా విడుదలయ్యాక ఆదిపురుష్ పై చాలామంది నెగిటివిటి చూపిస్తున్నారు. ఆదిపురుష్ విడుదల తర్వాత పబ్లిక్ నుండి, క్రిటిక్స్ నుండి, సోషల్ మీడియా నుండి ఆదిపురుష్ పై నెగెటివ్ రెస్పాన్స్ కనిపించింది. ఈ రోజు సోషల్ మీడియాలో ఆదిపురుష్ పై వినిపిస్తున్న,కనిపిస్తున్న నెగిటివిటి చూస్తే అమ్మో ఈ రేంజ్ లో ఉందా అని అనిపించకమానదు.
సోషల్ మీడియాలో #AdipurushDisaster, #BannedAdipurush, #BoyCuttAdipurush అనే హాష్ టాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. దీనిని బట్టే ప్రభాస్ ఆదిపురుష్ పై ఎంత నెగిటివిటీ చూపిస్తున్నారో తెలిసిపోతుంది. అంతేకాకుండా ప్రభాస్ కి వరసగా మూడు డిజాస్టర్స్ పడ్డాయి అంటూ యాంటీ ఫాన్స్ మరింతగా పండగ చేసుకుంటున్నారు. సాహో, రాధేశ్యామ్ ఇప్పుడు ఆదిపురుష్ అంటూ సోషల్ మీడియాలో ప్రభాస్ పై కామెడీ మొదలు పెట్టారు.
డిజాస్టర్ అయినా ఆ సినిమాపై ఇంత నెగిటివిటి చూపించడానికి కారణాలు.. సినిమాలో విషయం లేకపోవడం కాదు.. రామాయణాన్ని ఖూనీ చేసాడు అంటూ ఓం రౌత్ ని తిట్టిపోస్తున్నారు. ప్రభాస్ ఎలా ఒప్పుకున్నాడో ఈ చిత్రాన్ని అంటూ ప్రభాస్ నీ ఊరుకోవడం లేదు. అసలు ఆదిపురుష్ పోయినందుకు కాదు.. ఇంత నెగిటివి వస్తుంది అని ఆదిపురుష్ మేకర్స్ కూడా ఊహించి ఉండరు.