ప్రభాస్ కి ఆదిపురుష్ రిజల్ట్ ముందే తెలుసా.. అందుకే సైలెంట్ గా అమెరికా వెళ్లిపోయారా ఇప్పుడదే అందరిలో మెదులుతున్న ప్రశ్న. ఆదిపురుష్ టీజర్ అప్పుడే ఫాన్స్ డిస్పాయింట్ అవడం చూసిన ప్రభాస్ దర్శకుడు ఓం రౌత్ ని కమ్ టు మై రూమ్ అంటూ పిలవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. అందుకే ప్రభాస్ ఆదిపురుష్ ట్రైలర్ లాంచ్, ప్రీ రిలీజ్ ఈవెంట్ లోను గ్రాఫిక్స్ నచ్చాయా అని పదే పదే అడిగారు. కానీ ఇప్పుడు ఆదిపురుష్ విఎఫెక్స్ వర్క్ పై పలు విమర్శలు వినిపిస్తున్నాయి.
బాహుబలి లాంటి గ్రాఫిక్స్ చూసిన కళ్లతో ఆదిపురుష్ గ్రాఫిక్స్ చూస్తే వరెస్ట్.. రాజమౌళి ముందు ఓం రౌత్ నథింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఆదిపురుష్ టీజర్ తర్వాత ప్రభాస్ దాని రిజల్ట్ పై ఓ అవగాహనకి వచ్చెయ్యబట్టే ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత ఎలాంటి ప్రమోషన్స్ లేకుండానే సైలెంట్ అయ్యారు.. ఆదిపురుష్ రిజల్ట్ తో తనకేం సంబంధం లేదు అన్నట్టుగా ఆయన వెకేషన్ అంటూ అమెరికా చెక్కేశారు ఇలా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
బాహుబలి ప్రభాస్ ని చూసాక ఆదిపురుష్ రాఘవుడిగా ప్రభాస్ ని చూడలేకపోయాము, ఫ్లాష్ బ్యాగ్ ఎపిసోడ్ లో ప్రభాస్ జీసస్ మాదిరి డ్రెస్ లో కనిపించారు.. ఎలా చూసినా ఆయనలో రాజసం కనిపించలేదు.. అసలు హనుమంతుడి డైలాగ్స్, రాముడు చూస్తుండగానే సీతాపహరణం, సీత మాట్లాడే భాష, ఆ రవాణా లంక, ఇంకా ఇంద్రజిత్ ఒంటిపై ఆ టాటూస్ ఏమిటో.. రాఘవుడి చేతిలో రావణ సంహారం ఇంత సింపుల్ గానా.. అసలు రామాయణం పేరుతొ కార్టూన్స్ తెరకెక్కించారంటూ ఓం రౌత్ ని ఓ ఆటాడుకుంటున్నారు.
ఇప్పుడు మరోసారి ఓం రౌత్ ని ప్రభాస్ కమ్ టు మై రూమ్ అంటాడేమో అంటూ మీమ్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.