Advertisement

అక్కడ ఆదిపురుష్ కి కష్టాలు


ఫ్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్-కృతి సనన్ కలయికలో ఓం రౌత్ రామాయణం ఆధారంగా తెరకెక్కించిన ఆదిపురుష్ నేడు ప్రపంచ వ్యాప్త ప్రేక్షకుల ముందుకూ రాగా.. ఆదిపురుష్ ని తమ దేశంలో విడుదల కానిచ్చేది లేదు అంటూ నేపాల్లో కొన్ని థియేటర్స్ లో ఆదిపురుష్ విడుదల కాకుండా బ్యాన్ చెయ్యడం హాట్ టాపిక్ గా మారింది. దానికి కారణం లేకపోలేదు. ఆదిపురుష్ మూవీలో జానకి పాత్రలో కనిపించిన కృతి సనన్ ని భారతదేశపు కుమర్తె అని సంబోధించడంపై నేపాల్ సెన్సార్ బోర్డు తప్పుబట్టింది.

Advertisement

ఎదుకంటే సీత నేపాల్ లో జన్మించింది అని నేపాలీలు నమ్మకం. దానితో అక్కడ సినిమా రిలీజ్ అవ్వకుండా బ్యాన్ విధించారు. నేపాల్ రాజధాని ఖాట్మండ్ లో కొన్ని థియేటర్స్ లో ఆదిపురుష్ విడుదల కాకుండా బ్యాన్ చేసారు. ఆ డైలాగ్ ని తొలగించాలంటూ ఆదిపురుష్ మేకర్స్ కి కోరగా.. వివాదానికి కారణమైన ఆ డైలాగ్ ని మేకర్స్ తొలగించడంతో  నేపాల్ లో ఆదిపురుష్ రిలీజ్ కి లైన్ క్లియర్ అయ్యింది. అయినప్పటికీ  ఖాట్మండు మేయర్ ఇండియన్ సినిమాల విషయంలో సీరియస్ గా ఉన్నట్లుగా తెలుస్తుంది.

అయితే నేపాల్ లో మార్నింగ్ షోస్ ఆగిపోగా.. తర్వాత నుండి యధావిధిగా ఆదిపురుష్ షోస్ మొదలయ్యాయి. ప్రస్తుతం ప్రభాస్ ఫాన్స్ మాత్రమే కాదు.. రామ భక్తులంతా ఆదిపురుష్ కోసం థియేటర్స్ కి క్యూ కట్టారు.

Nepal Threatens To Ban Adipurush:

Kathmandu Mayor Threatens To Ban Indian Films
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement