Advertisement
Google Ads BL

ఆ హీరో నన్ను వేధించాడు: నిత్యా మీనన్


పెర్ఫార్మెన్స్ ఒరియంటెడ్ పాత్రలకి నిత్యా మీనన్ పెట్టింది పేరు. స్కిన్ షో చేయదు. గ్లామర్‌గా కనిపించదు. ట్రెడిషనల్ గానే ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనే మెరుస్తుంది, కథ నచ్చితేనే ఒప్పుకుంటుంది. పారితోషకం ఇస్తున్నారని ఏదీ బడితే అది చెయ్యదు. అలా మడి కట్టుకునికూర్చోవడం కూడా నిత్యా మీనన్‌కి మైనస్ అయ్యింది. కొన్ని పాత్రలకే పరిమితమైన నిత్యా మీనన్‌ని దర్శకనిర్మాతలు కూడా లైట్ తీసుకుంటున్నారు. నటన పరంగా ఎన్ని మంచి మార్కులు వేయించుకున్నా.. గ్లామర్ విషయంలో జీరో అందుకే.. నిత్యా మీనన్‌కి స్టార్ అవకాశాలు దక్కలేదు.

Advertisement
CJ Advs

అయితే.. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేసిన నిత్యా మీనన్‌ని ఓ స్టార్ హీరో వేధించాడట. తాజా ఇంటర్వ్యూలో నిత్యా మీనన్ మాట్లాడుతూ ఓ తమిళ హీరోపై చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి హీరోలు, దర్శకనిర్మాతలు అందరూ కూడా నన్ను ఎంతో గౌరవంగా చూసుకున్నారు. నాకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి సమస్యలు తలెత్తలేదు. కానీ తమిళంలో అలా కాదు.

తమిళనాట ఓ సినిమా చేస్తున్న సమయంలో నాతో కలిసి నటించిన ఓ హీరో మాత్రం పదే పదే నన్ను అసభ్యంగా తాకుతూ చాలా ఇబ్బందిపెట్టేవాడు. అతని చేష్టల కారణంగా ఇరిటేట్ అవుతూ ఆ సినిమాను పూర్తిచేయడం కష్టమైపోయింది అంటూ నిత్యామీనన్ ఆ తమిళ హీరో పేరు చెప్పకుండానే ఆ హీరోపై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.

Nithya Menen Sensational Comments on Star Hero:

Tamil Hero Harassed Me Says Nithya Menen <div></div>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs