ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్-బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ కలయికలో బిగ్గెస్ట్ ప్యాన్ ఇండియా మూవీగా, రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఆదిపురుష్ నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మోడ్రెన్ రామగా ప్రభాస్, జానకిగా కృతి సనన్, రావణ్ గా సైఫ్ అలీ ఖాన్ నటించిన ఈ చిత్రంపై ప్రేక్షకులు క్రేజీగా కనిపిస్తున్నారు. భారీ అంచనాలు నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆదిపురుష్ ఓవర్సీస్ ప్రీమియర్స్ పూర్తి కాగా.. హైదరాబాద్ లో ఈ రోజు ఉదయం 4 గంటల నుండే ఆదిపురుష్ బెన్ఫిట్ షోస్ తో ప్రభాస్ ఫాన్స్ రచ్చ షురూ అయ్యింది.
ఓవర్సీస్ టాక్ లోకి వెళితే.. ఆదిపురుష్‌లో అసలు సిసలైన హైలైట్ రాముడు పాత్రను పోషించిన ప్రభాస్ అని, ప్రభాస్ పై తెరకెక్కించిన యాక్షన్ సీన్స్‌ను ఫ్యాన్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తారని ఆడియన్స్ చెబుతున్నారు. రాముడిగా ప్రభాస్ నటన అద్భుతమంటూ ట్వీట్స్ వేస్తున్నారు. దర్శకుడు ఓం రౌత్ ఫస్ట్ హాఫ్ పై ఫోకస్ ఎక్కువగా పెట్టాడని.. ఫస్ట్ హాఫ్‌లోని డ్రామా అద్భుతంగా స్క్రీన్‌పై ప్రజెంట్ చేశాడని మాట్లాడుకుంటున్నారు. అయితే అసలు కథ మొత్తం ఫస్ట్ హాఫ్‌లోనే చెప్పడంతో సెకండాఫ్ లో చెప్పడానికి ఏం లేకపోవడంతో సాగదీశాడని కామెంట్స్ వినిపిస్తోన్నాయి.
రామాయణాన్ని నేటి తరానికి కనెక్ట్ అయ్యేలా మోడ్రెన్ గా ఆదిపురుష్ ద్వారా చెప్పాలనే ప్రయత్నంలో ఓంరౌత్ పూర్తిస్థాయిలో సక్సెస్ కాలేకపోయారని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఫస్ట్ హాఫ్ ఇంట్రెస్టింగ్ గా అనిపించినా.. సెకండాఫ్ చాలా బోరింగ్‌గా సాగుతుంద.. యాక్షన్ సీన్స్ కాస్త ఎక్కువగా ఉన్నాయని, క్లైమాక్స్ ఫైట్ లెంగ్తీగా ఉండటం, ఆ సీన్స్ లోని గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడం ప్రేక్షకులని డిజపాయింట్ చేస్తుందని అంటున్నారు.
అలాగే సినిమాలోని చాలా సన్నివేశాలు కార్టూన్ లోని బొమ్మలు కదిలినట్టుగా అనిపించాయని, మిగతా కేరెక్టర్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉండడంతో ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ తక్కువగా ఉందంటూ ప్రభాస్ ఫాన్స్ ఫీలవుతున్నారు.