Advertisement
Google Ads BL

ఆదిపురుష్ విడుదలకు ముందు ప్రభాస్ సర్పైజ్


ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఎంత ఉదార స్వభావుడో.. ఆయన అభిమానులని ఎంతగా ప్రేమిస్తారో, కష్టంలో ఉన్న వాడికి సహాయం చేసే గుణమే కాదు.. తన అభిమాని ప్రాణంపోతున్న సమయంలోను ఆ అభిమాని గురించి ఆలోచించే మంచి మనసు ఆయనకుంది. పెదనాన్న కృష్ణం రాజుగారు చనిపోయినప్పుడు విలేజ్ లో అభిమానులకి పెద్ద ఎత్తున భోజనాలు పెట్టించడమే కాదు.. ఆయన సినిమా సెట్స్ లో స్టార్స్ కి, చిన్న ఆర్టిస్ట్ లకి తన ఇంటి నుండి కెరియర్ లు తెప్పిస్తారని చాలామంది చెబుతూవుంటారు. ఓ అభిమాని చివరి కోరిక గా తనని చూడాలంటే వెంటనే అప్పోయింట్మెంట్ ఇచ్చి అతన్ని కలిసాడు.

Advertisement
CJ Advs

రేపు శుక్రవారం ప్రభాస్ నటించిన ఆదిపురుష్ మూవీ వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతుంది. ఆదిపురుష్ సినిమా విడుదలకు రెండు రోజుల ముందు ప్రభాస్ తాను కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో చేస్తున్న సలార్ మూవీ సహాయక సిబ్బంది అందరికి సర్ ప్రైజ్ గిఫ్ట్స్ ఇచ్చాడు. వారందరికీ ఒక్కొక్కరికి చొప్పున పది వేలు రూపాయలు వాళ్ళ అకౌంట్స్ లో డిపాజిట్ చేసినట్లుగా సోషల్ మీడియాలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. నిజంగా ప్రభాస్ ఎంత ఉదార స్వభావుడో మరోసారి నిరూపితమైంది. 

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలే కాదు.. నార్త్, ఓవర్సీస్ ఆడియన్స్  అంతా ఆదిపురుష్ మ్యానియాలోనే ఉన్నారు. ఆదిపురుష్ మొదటి రోజు 100 కోట్లు కలెక్ట్ చేస్తుంది అంటూ ప్రభాస్ ఫాన్స్ బెట్టింగ్స్ వేస్తున్నారు. బుక్ మై షో ఓపెన్ చెయ్యగానే టికెట్స్ అన్నీ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. 

Prabhas did well before the release of Adipurush:

Prabhas Surprise Gift To Salaar Crew
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs