కింగ్ నాగార్జున కొద్ది నెలలుగా చాలా అరుదుగా మీడియాలో కనిపిస్తున్నారు. ఘోస్ట్ ప్లాప్ తర్వాత నాగార్జున కొత్త సినిమా ప్రకటన కోసం అక్కినేని అభిమానులు ఎప్పటినుండో వెయిట్ చేస్తున్నారు. కానీ నాగార్జున ఇంకా కొత్త సినిమా కబురు చెప్పకుండా దాటవేస్తూనే ఉన్నారు. అక్కినేని కాపాండ్ మొత్తం ప్లాప్ ల పరంపర కోనసాగడం కూడా నాగార్జున డిస్పాయింట్ అవడానికి ప్రధాన కారణం అని తెలుస్తుంది. ఇప్పుడు నాగార్జున కొత్త సినిమా కోసం లుక్ మార్చారా అనే విషయం చర్చకు దారి తీసింది.
నాగార్జున రీసెంట్ గా ఓ సినిమా ఈవెంట్ లో కనిపించారు. ఆ ఈవెంట్ లో నాగార్జున సాల్ట్ అండ్ పెప్పర్, లాంగ్ హెయిర్ తో కొత్తగా కనిపించారు. షర్ట్ కార్గో జీన్స్ వేసి స్టయిల్ గా అదరగొట్టేసారు. ఈ లుక్స్ చూస్తుంటే వింటేజ్ నాగర్జున గుర్తుకురాక మానరు. ఫిట్ నెస్ విషయంలో అలెర్ట్ గా ఉండే నాగార్జున ఎప్పుడూ స్టైలిష్ లుక్స్ కే ప్రాధాన్యత ఇస్తారు. అలాగే యంగ్ లుక్ లో కనిపించేందుకు ప్రయత్నాలు చేస్తారు. ఇప్పుడు కూడా తన కొత్త సినిమా కోసమే నాగార్జున ఈ కొత్త మేకోవర్ అని తెలుస్తుంది.
ప్రస్తుతం నాగార్జున కొత్త లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు నాగార్జున ప్రసన్న కుమార్ తో సెట్స్ మీదకి వెళతారో.. లేదంటే మలయాళ రీమేక్ లో నటిస్తారో అనే క్యూరియాసిటీ అక్కినేని అభిమానుల్లో కనిపిస్తుంది.