తమన్నా-విజయ్ వర్మ కలిసి డేటింగ్ లో ఉన్నారు, న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ అప్పుడు సీక్రెట్ గా పార్టీ చేసుకున్నారు. ఆ విషయాన్ని కూడా మీడియా పసిగట్టేసి ప్రముఖంగా ప్రచురించింది. అయినా తమన్నా కానీ, విజయ్ వర్మ కానీ డేటింగ్ విషయాన్ని బయటపెట్టలేదు. మీడియా అడిగినా చిందులు తొక్కారు. కానీ ఇప్పుడు తమన్నా, విజయ్ వర్మ ఇద్దరూ ఒకరి తర్వాత ఒకరు డేటింగ్ విషయాన్ని రివీల్ చేసారు. తమన్నా అయితే విజయ్ వర్మ తో తన లవ్ విషయాన్ని ఓపెన్ గా చెప్పేసింది.
తాను నాకు రక్షణగా ఉంటాడు. నన్ను కిందకి దోసేసేవారినుండి కాపాడతాడు. అతనితో నా లైఫ్ బావుంటుంది అంటూ చెప్పుకొచ్చింది. ఇప్పుడు తాజాగా విజయ్ వర్మ లాస్ట్ స్టోరీస్ 2 ప్రమోషన్స్ లో తమన్నాతో ప్రేమ విషయం దాచడానికి కారణాలు చెప్పాడు. ప్రస్తుతం నా లైఫ్ లో నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే ప్రజలకు నా ప్రొఫెషన్, నా కెరీర్ కి సంబందించిన విషయాలు మత్రమే తెలియాలనుకున్నాను.
సరైన సమయంలోనే నా వ్యక్తిగత వివరాలు వెల్లడించాలనుకున్నాను. అప్పుడే మీకు చెబుదామనుకున్నాను అంటూ విజయ్ వర్మ తన లైఫ్ లో తమన్నా ఉంది అంటూ క్లారిటీ ఇచ్చాడు. ఇక తమన్నా-విజయ్ వర్మ లస్ట్ స్టోరీస్2 లో కలిసి నటించారు. అదే షూటింగ్ లో ప్రేమలో పడినట్లుగా తమన్నా చెప్పుకొచ్చింది.