గ్లోబల్ స్టార్ ప్రభాస్ శ్రీరాఘవుడిగా, బాలీవుడ్ యంగ్ హీరోయిన్ కృతిసనన్ జానకిగా నటించిన ‘ఆదిపురుష్’ ఆగమనానికి ఇంకొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది. ఈలోపు బాక్సాఫీస్ వద్ద ఎటువంటి సునామీ చూపించాలో.. అంతా ఈ సినిమా చూపిస్తోంది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో లేని.. అడ్వాన్స్ బుకింగ్స్‌లో అద్భుతాలను క్రియేట్ చేస్తూ.. నిజంగానే బాక్సాఫీస్ సునామీకి ఈ ఆదిపురుషుడు కేరాఫ్ అడ్రస్ అవుతున్నాడు. అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే దాదాపు రూ. 100 కోట్లకు పైగా కొల్లగొట్టబోతున్న ఈ ‘ఆదిపురుష్’ అద్భుతానికి ఇంకేం రుజువు కావాలి.
వాస్తవానికి ఈ సినిమా టీజర్ విడుదలైనప్పుడు ప్చ్.. అంటూ పెదవి విరిచిన వాళ్లే ఇప్పుడు ఫస్ట్ వరుసలో కూర్చుని ఈ సినిమాని వీక్షించేందుకు సిద్ధమవుతుండటం ఈ సినిమాకున్న గొప్పతనం కాక ఇంకేమిటి? ఇది ఎలా సాధ్యమవుతుంది? అంటే దానికి కారణం ప్రభాసో.. దర్శకుడు ఓం రౌతో కానే కాదు. కొన్ని అద్భుతాలకు కారణం చెప్పలేం అంతే.. చెప్పినా ఎవరూ నమ్మరు. ఈ సినిమాకున్న పవర్ అటువంటిది మరి. మొదటి నుంచి ఈ సినిమాని ఓ శక్తి నడిపిస్తుంది.. ఆ శక్తి ఏమిటనేది చెబితే చాలా బాగోదు. ఈ టైమ్‌లో అస్సలు బాగోదు. అదేదో తెలియని శక్తి అని అనుకోవడమే బెటర్.
ఇక ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ విషయానికి వస్తే.. ఓవర్సీస్, నార్త్ ఇండియాలలో ఈ సినిమాకు ఆకాశమే హద్దు అనేలా.. హాట్ కేకులా టికెట్లన్నీ అమ్ముడైపోయాయి. తెలుగు రాష్ట్రాలలో టికెట్ ధరల నిమిత్తం.. ప్రభుత్వాల అనుమతి కోసం అడ్వాన్స్ బుకింగ్స్ ఆపేశారు. ఇరు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి ఎప్పుడైతే అనుమతి వచ్చేసిందో.. వెంటనే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. కళ్లు మూసి తెరిచేలోపు.. ఖాళీ అనే పదానికి చోటు లేకుండా టికెట్లు మొత్తం అమ్ముడైపోయాయి. ఇంతకంటే ఏం కావాలి.. ఈ సినిమాకున్న క్రేజ్ గురించి చెప్పడానికి. ఏదైతేనేం.. మొదట్లో ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నా.. ఇప్పుడు మాత్రం ఈ ‘ఆదిపురుష్’కి తిరుగులేదంతే. ఈ క్రేజ్‌లో టాక్ కొంచెం పాజిటివ్‌గా వస్తేనా.. బాక్సాఫీస్ వద్ద ‘ఆదిపురుష్’ అరాచకాన్ని ఆపడం ఎవరితరమూ కాదు. ఇంకా చెప్పాలంటే.. ఈ సినిమా పేరుకు ముందు ఇక ‘నాన్’ చేరిపోవడం ఖాయం.