Advertisement
Google Ads BL

కొడుకు-కోడలికి వెడ్డింగ్ డే విషెస్ తెలిపిన చిరు


మెగాస్టార్ చిరంజీవి తన కొడుకు రామ్ చరణ్ కి కోడలు ఉపాసనకు వెడ్డింగ్ యానివర్సీసీ విషెస్ ని సోషల్ మీడియా వేదికగా తెలిపారు. చరణ్-ఉపాసన 11 వ వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా మెగా ఫ్యామిలీ సభ్యులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేసారు. పదకొండేళ్ల అన్యోన్య దాంపత్యానికి ప్రతీకగా ఉపాసన తల్లికాబోతుంది. మెగా ఫ్యామిలీలోకి వారసుడు రాబోతున్నాడు. జులై నెలలో ఉపాసన పండండి బిడ్డకి జన్మనిచ్చేందుకు రెడీగా ఉండగా.. మెగా ఫ్యామిలీ మొత్తం వారసుడి రాక కోసం వేయికళ్లతో ఎదురు చూస్తుంది.

Advertisement
CJ Advs

అయితే నేడు పెళ్లి రోజు జరుపుకుంటున్న కొడుకు చరణ్, కోడలి ఉపాసనకు మెగాస్టార్ చిరు సోషల్ మీడియా వేదికగా..  హాయ్ చరణ్, ఉప్సీ, ఈ ప్రత్యేకమైన రోజున మీ ఇద్దరికీ వెడ్డింగ్ యానివర్సరీ శుభాకాంక్షలు. మీరిద్దరూ మమ్మల్ని గర్వపడేలా, సంతోష పడేలా చేశారు. మీ పేరెంట్ హుడ్ ప్రయాణంలో మీరు అడుగు పెడుతున్నప్పుడు మేము మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నాము. మీ పిల్లల పట్ల మీకున్న ప్రేమ ఇతరులు కూడా ఇష్టపడే కథగా ఉండనివ్వండి అంటూ ట్వీట్ చేసారు.

దీనితో పాటుగా మెగాస్టార్ చిరు చరణ్-ఉపాసనల అందమైన పిక్ ని కూడా అందరితో పంచుకున్నారు. ఇక రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ షూటింగ్ లో పాల్గొంటూ తన భార్యని ప్రేమగా చూసుకుంటున్నాడు. ఇద్దరూ కలిసి ఎక్కడికి వెళ్లినా ఆమె చెయ్యి వదలకుండా జాగ్రత్తగా చూసుకుంటున్న విషయం రీసెంట్ గా శరానంద్ వెడ్డింగ్ రిసెప్షన్ లో అందరి కంటపడింది. మరి ఈ క్యూట్ కపుల్ కి మన సినీజోష్ టీమ్ తరపున ఏ వెరీ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ.. చరణ్ అండ్ ఉపాసన.

Chiranjeevi extends warm wishes to son Ram Charan and Upasana:

Dad Chiranjeevi wishes Ram Charan-Upasana on wedding anniversary
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs