Advertisement
Google Ads BL

బాహుబలిపై తమన్నా సంచలన వ్యాఖ్యలు


బాహుబలి రెండు అపార్ట్ లు ప్యాన్ ఇండియా మార్కెట్ లో ఎంత సంచలనం సృష్టించిందో.. ఆ సినిమాతో ప్రభాస్, రానా ఫ్యాన్ ఇండియా స్టార్స్ గా మారిపోవడమే కాదు ప్రస్తుతం కూడా ప్యాన్ ఇండియా మూవీస్ లోనే నటిస్తున్నారు. కానీ ఆ సినిమాలో నటించిన తమన్నా మాత్రం బాహుబలి సక్సెస్ ని అస్సలు ఎంజాయ్ చెయ్యలేకపోయింది. అవంతిక పాత్రలో కనిపించిన తమన్నాకి బాహుబలితో పేరు రాలేదు,  ప్రశంశలు దక్కలేదు. తమన్నా ఒక్కటే బాహుబలి వలన నష్టపోయింది.

Advertisement
CJ Advs

ఎప్పటినుండో ఆ అసంతృప్తితోనే ఉన్న తమన్నా తాజాగా బాహుబలిలో తన పాత్రకి ఎందుకు పేరు రాలేదో చెప్పింది. బాహుబలి లాంటి చిత్రాల్లో హీరోలకే ఎక్కువ పేరు వస్తుంది అనేది నా అభిప్రాయం. అందుకే ఈ చిత్రంతో ప్రభాస్, రానా గ్లోబల్ స్టార్స్ అయ్యారు. సక్సెస్ సాధిస్తున్నారు. ఇంకా అనుష్క, రమ్యకృష్ణ పాత్రలకి కూడా మంచి పేరొచ్చింది. కానీ నా పాత్ర మాత్రం అతిధి పాత్రగానే మిగిలిపోయింది. అందుకే నా పాత్రకి పేరు రాలేదు. ప్రశంశలు దక్కలేదు.

ఈ చిత్రం కోసం ప్రభాస్, రానా చాలా కష్టపడ్డారు. వారు పేరుకి, ప్రశంశలకి అర్హులు. ఇక ఈ చిత్రంలో నా పాత్ర చిన్నదైనా చాలా కీలకమైంది. అది ఆడియన్స్ కి బాగా నచ్చింది. కానీ బాహుబలి సక్సెస్ ని తాను మాత్రం క్యాష్ చేసుకోలేకపోయినట్లుగా వాపోతుంది తమన్నా.

Tamannaah reveals why the success of Baahubali:

Tamannaah on not cashing in on Baahubali success: Credit for action films is still given to male stars
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs