Advertisement
Google Ads BL

ప్రభాస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కృతి సనన్


ప్రభాస్-కృతి సనన్ ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారు. త్వరలోనే వివాహం చేసుకుంటారు, దుబాయ్ లో ప్రభాస్-కృతి సనన్ ల ఎంగేజ్మెంట్ సీక్రెట్ గా జరగబోతుంది అంటూ కొన్ని రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లుకొట్టాయి. కానీ ప్రభాస్-కృతి సనన్ ఇద్దరూ ఆ వార్తలని కొట్టి పారేసారు. మా మధ్యన ఫ్రెండ్ షిప్ తప్ప మారేది లేదు అన్నారు. తాజాగా కృతి సనన్ ఆదిపురుష్ ప్రమోషన్స్ లో ప్రభాస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రమోషన్స్ లో భాగంగా ప్రభాస్ తో కలిసి వర్క్ చెయ్యడం ఎలా అనిపించింది అని కృతి సనన్ ని అడగ్గా..

Advertisement
CJ Advs

దానికి కృతి సనన్.. ప్రభాస్ తో వర్క్ ఎక్స్ పీరియన్స్ సూపర్బ్. ఆయన చాలా నెమ్మదిగా, ప్లెజెంట్ గా ఉంటాడు. మొదట్లో ప్రభాస్ అంతగా మాట్లాడేవాడు కాదు. ఆయన చాలా సిగ్గుపడేవాడు. ఎదుటి వ్యక్తులని చాలా గౌరవిస్తాడు. మొదట్లో నేను తెలుగులో చేసిన సినిమా గురించి మాట్లాడాను. మనకి రాని భాషలో నటించడం అంటే చాలా కష్టమని చెప్పాను. అప్పటినుండి ప్రభాస్ చాలా ఓపెన్ గా మాట్లాడేవాడు. నేనే మాములుగా మాట్లాడేదానిని. ఆయన తన కళ్ళతోనే భావాలని వ్యక్తపరుస్తాడు.

తన పని తాను చేసుకుపోతాడు. ఆదిపురుష్ లో రాఘవుడిగా ప్రభాస్ ని తప్ప మరొకరిని ఊహించుకోలేమంటూ కృతి సనన్ ప్రభాస్ పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ప్రభాస్ ఫాన్స్ కూడా ప్రభాస్ పై వచ్చే వార్తలు కోసం బాగా ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నారు.

Kriti Sanon made interesting comments on Prabhas:

Kriti Sanon says Adipurush co-star Prabhas
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs