వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిలు ఏడేళ్ల ప్రేమని పెళ్లి పీటలెక్కించేందుకు రెడీ అయ్యారు. వరుణ్ తేజ్-లావణ్యల ప్రేమ వ్యవహారం ఎంత గుట్టుగా నడిచినా మీడియా పసిగట్టేసి.. వారు డేటింగ్ లో ఉన్నారనే విషయాన్ని పదే పదే ధ్రువీకరిస్తూ వచ్చినట్టుగానే జూన్ 9 న వరుణ్-లావణ్యలు పెద్దల సమక్షంలో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. మెగాస్టార్ చిరు దంపతులు, నాగబాబు దంపతులు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ దంపతులు, అల్లు అర్జున్ జంట.. ఓవరాల్ గా మెగా ఫ్యామిలీ మొత్తం వరుణ్ తేజ్-లావణ్యల నిశ్చితార్ధపు వేడుకలో సందడి చేసారు.
అయితే వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిల పెళ్లి నవంబర్ లో కానీ డిసెంబర్ లో కానీ డెస్టినేషన్ వెడ్డింగ్ గా ఉండొచ్చనే ఊహాగానాలు ఉండగా.. ఇప్పుడు లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ కి పెళ్ళికి ముందే ఓ కండీషన్ పెట్టింది అనే వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. హీరోయిన్ గా లావణ్య త్రిపాఠి సినిమాలకు గుడ్ బై చేప్పినా.. సినిమా ఇండస్ట్రీకి దగ్గరగా ప్రొడక్షన్ వైపు వెళ్ళబోతున్నట్లుగా తెలుస్తుంది.
అయితే వరుణ్ తేజ్ ని వివాహం చేసుకున్నాక కూడా ఆమె తనకి ఇష్టమైన భారత నాట్యాన్ని వదలను అని, ఎక్కడైనా తనకి స్టేజ్ పెరఫార్మెన్స్ ఇచ్చే అవకాశం వస్తే ఖచ్చితంగా చేస్తానని వరుణ్ దగ్గర మాట తీసుకుందట. వరుణ్ తేజ్ మాత్రమే కాదు.. లావణ్య త్రిపాఠి ప్రపోజల్ ని మెగా ఫ్యామిలీ మొత్తం అంగీకరించిన తర్వాతే లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ తో ఏడడుగులు వేసేందుకు రెడీ అయినట్లుగా తెలుస్తుంది.