ఒకప్పుడు సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ సోషల్ మీడియాకి దూరంగా ఉండే కృతి శెట్టి స్టయిల్ మార్చింది. వరస ప్లాప్ లు ఆమెని టోటల్ గా మార్చేశాయి. అందుకే డల్ గా ఉండే కృతి శెట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా మారిపోయింది. తరచూ గ్లామర్ ఫొటోస్ ని షేర్ చేస్తుంది. ఊపిరి తీసుకోనివ్వనంతగా రకరకాల అవుట్ ఫిట్స్ తో అదరగొట్టేస్తుంది. డిజైనర్ వేర్, గ్లామర్ లుక్స్ తో కనిపించే అవుట్ ఫిట్స్, ట్రెడిషనల్ లెహంగాస్ ఇలా ప్రతి అవుట్ ఫిట్ లో మెరుపులు మెరిపిస్తుంది.
రీసెంట్ గా కృతి శెట్టి నుండి మెస్మరైజింగ్ అనేలాంటి ఫోటో షూట్ బయటికి వచ్చింది. డిజైనర్ బ్లౌజ్ తో ఎల్లో లెహంగాలో కృతి శెట్టి ఇచ్చిన ఫోజులకి యూత్ కి కునుకు వస్తుందో.. లేదో అన్నంత బ్యూటిఫుల్ గా ఉంది. ప్రస్తుతం తమిళనాట కార్తీ జపాన్ లో నటిస్తుంది. వరసగా నాలుగు సినిమాల ప్లాప్ తో కృతి శెట్టి కెరీర్ కాస్త డల్ అయ్యింది. మళ్ళీ ఓ హిట్ కృతి చెంతకి చేరితే ఆమెని ఎవ్వరూ ఆపలేరు.
ప్రస్తుతం కృతి శెట్టి కిర్రాక్ ఫోజులతో కనిపించిన ఎల్లో అవుట్ ఫిట్ ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.