Advertisement
Google Ads BL

కాస్త పువ్వుల్ని, అమ్మాయిల్ని చూపించడయ్యా!


నందమూరి హీరోలు అనగానే వయలెన్స్‌కి కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయారు. అసలు ప్రేమ, జాలి వంటివేవీ వారికి లేదన్నట్లుగా మేకర్స్ ఫిక్స్ అవుతున్నారు. అందుకే ఈ మధ్య వచ్చిన ఎన్టీఆర్ చిత్ర అప్‌డేట్‌కానీ, రీసెంట్‌గా వచ్చిన బాలయ్య రెండు చిత్రాల అప్‌డేట్స్‌గానీ.. హింసతో నింపేశారు. రక్తం ఏరులై పారుతుందనేలా హింట్‌లు ఇచ్చేస్తున్నారు. ఇదంతా చూస్తున్న నెటిజన్లు కొందరు.. ‘జులాయి’ సినిమాలో రాజేంద్రప్రసాద్ చేత త్రివిక్రమ్ చెప్పించిన డైలాగ్‌ని ఈ సినిమాలకు ఆపాదిస్తున్నారు. కత్తులు, కటార్లే కాదయ్యా.. కాస్త పువ్వుల్ని, అమ్మాయిల్ని కూడా చూపించడయ్యా..! అంటూ రిక్వెస్ట్‌లు పెడుతున్నారు. 

Advertisement
CJ Advs

NTR30.. అదే ‘దేవర’ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు వచ్చిన అప్‌డేట్స్ ఒక్కసారి చూస్తే.. నిజంగా ప్రపంచంలో ఇన్ని రకాల కత్తులు ఉంటాయా? అనేలా ఈ చిత్రాన్ని ప్రజంట్ చేస్తున్నారు. టైటిల్ రివీల్ చేయడానికి ముందు కూడా రకరకాల కత్తులతో ఆ సినిమాని ప్రమోట్ చేస్తూ వచ్చారు. ఆ కత్తులతో పాటు వారు వదిలిన కొటేషన్స్ కూడా.. ఈ సినిమాలో రక్తపాతం ఏ రేంజ్‌లో ఉండబోతుందో తెలియజేశాయి. ‘దేవర’ అనే టైటిల్‌తో వదిలిన ఫస్ట్ లుక్‌‌లో కూడా భారీ ఖడ్గం ఎన్టీఆర్ చేతిలో ఉంది. ఆ కత్తితో ఎన్టీఆర్ చేసిన వీరంగానికి చిహ్నంగా ఆయన దుస్తులపై బ్లడ్‌ని గమనించవచ్చు. ఇక నటసింహం నందమూరి బాలకృష్ణ విషయానికి వస్తే..

అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య చేస్తున్న చిత్రానికి ‘భగవంత్ కేసరి’ అనే టైటిల్‌ని ఫిక్స్ చేసి వదిలిన ఫస్ట్ లుక్‌లో కూడా బాలయ్య చేతిలో ఓ పవర్‌ఫుల్ వెపన్‌ని గమనించవచ్చు. ఆ స్టిల్‌ చూస్తే అదొక యాక్షన్ ఎపిసోడ్ అని తెలుస్తుంది. విడుదల చేసిన టీజర్‌లో చివరి బిట్ తప్పితే.. టీజర్ అంతా నటసింహం పంజా విసిరితే ఎలా ఉంటుందో అలా ప్రజంట్ చేశారు. ఇదే సందర్భాన్ని పురస్కరించుకుని.. బాలయ్య మరో సినిమా‌ ఫస్ట్ లుక్‌ని కూడా విడుదల చేశారు. ‘వాల్తేరు వీరయ్య’ దర్శకుడి దర్శకత్వంలో ఈ వీరసింహారెడ్డి నటించే NBK109 ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఓ టూల్ బాక్స్‌ని ఓపెన్ చేసి పెట్టారు. అందులో ఉన్న పనిముట్లను చూస్తే.. మరోసారి నందమూరి హీరోలను దర్శకులు ఎలా ఊహించుకుని కథలు రాస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అందుకేనేమో.. కాస్త పువ్వుల్ని, అమ్మాయిల్ని కూడా చూపించడయ్యా.. అని నెటిజన్లు వేడుకుంటున్నారు.  

Netizens Reaction on Nandamuri Heroes Latest Films First Looks:

Nandamuri Heroes Turns Cae of Address to Violence
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs