రకుల్ ప్రీత్ టాలీవుడ్ లో కనిపించకపోయినా.. ముంబైలో బాగా బిజిగా ఉన్న భామ. హిందీ సినిమాలతోనే కాదు.. అక్కడ రకుల్ ఓ బాయ్ ఫ్రెండ్ ని కూడా మెయింటింగ్ కూడా చేస్తున్న విషయం తెలిసిందే. ముంబైకి చెందిన హీరో కమ్ ప్రొడ్యూసర్ జాకీ భగ్నానీ తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న రకుల్ ప్రీత్ అతనితో కలిసి వెకేషన్స్ కి మాత్రమే కాదు బాలీవుడ్ లో జరిగే బర్త్ డే పార్టీలకి, వెడ్డింగ్ రిసెప్షన్స్ కి, అవార్డు వేడుకలకి హాజరవుతుంది.
తాజాగా ముంబైలో జరిగిన ప్రొడ్యూసర్ మధు మంతెన వెడ్డింగ్ రిసెప్షన్ లో రకుల్ తన బాయ్ ఫ్రెండ్ జాకీ తో కలిసి సందడి చేసింది. బాయ్ ఫ్రెండ్ జాకీ భగ్నానీతో కలిసి ఫొటోలకి ఫోజులిచ్చింది. రకుల్ ప్రీత్ చాలా గ్లామర్ గా స్టయిల్ గా హాజరవగా.. రకుల్ ప్రీత్ కి మ్యాచింగ్ అవుట్ ఫిట్ తో జాకీ కనిపించాడు. వాళ్లిద్దరూ చాలా బ్యూటిఫుల్ గా కనిపించారు.
ఇక త్వరలోనే రకుల్-జాకీ భగ్నానీ వివాహం ఉంటుంది.. రకుల్ పెళ్ళెప్పుడు అని మీడియా అడిగితే చాలు రకుల్ ప్రీత్ మాత్రం నా పెళ్లి గురించి మీకెందుకు, నేనప్పుడేపెళ్లి చేసుకోను అంటూ ఎగురుతుంది. అన్నట్టు ఈమధ్యన రకుల్ ప్రీత్ మాల్దీవుల వెకేషన్స్ లో గ్లామర్ పరంగా ఎలా రెచ్చిపోయిందో సోషల్ మీడియాలో ఆమె వదిలిన పిక్స్ చూస్తే తెలుస్తుంది.