Advertisement
Google Ads BL

బాలీవుడ్ హీరోలతో అల్లు అర్జున్ హగ్గులు


అల్లు అర్జున్ పుష్ప చిత్రం దగ్గర నుండి ముంబైకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. అక్కడ బాలీవుడ్ పరిచయాలే కాదు.. బాలీవుడ్ మీడియాకి దగ్గరగా ఉండడం, బాలీవుడ్ లో స్పెషల్ గా పీఆర్ టీమ్ ని మెయింటింగ్ చెయ్యడం.. ఇలా ప్రతి విషయంలోనూ నార్త్ లో క్రేజ్ కోసం అల్లు అర్జున్ తరుచూ ముంబై వెళుతున్నారు. తాజాగా అల్లు అర్జున్ భార్య తో కలిసి ముంబై లో ల్యాండ్ అయ్యారు. ఇటలీ వెకేషన్స్ ముగించుకుని అల్లు అర్జున్ నేరుగా ముంబై వెళ్ళారు.

Advertisement
CJ Advs

కారణం మధు మంతెన వెడ్డింగ్ రిసెప్షన్ లో పాల్గొనడానికి. నిర్మాత మధు మంతెన మొదటి పెళ్లి బ్రేక్ అయిన తర్వాత ఇరా త్రివేదిని ప్రేమించి జూన్ 11న వివాహం చేసుకున్నారు. అదే రోజు అంటే నిన్న ఆదివారమే ముంబైలో ఆయన సినీ ప్రముఖులుకి గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేసారు. అల్లు అరవింద్ ఫ్యామిలీకి నిర్మాత మధు మంథెనకి మంచి అనుబంధం ఉండడంతోనే అల్లు అర్జున్ ముంబై వెళ్లి ఆయన రిసెప్షన్ లో పాల్గొనగా.. అక్కడి వచ్చిన అమీర్ ఖాన్, హృతిక్ రోషన్ తో అల్లు అర్జున్ హగ్ చేసుకుని సరదాగా మాట్లాడిన ఫొటోస్ బయటకి వచ్చాయి.

ఇంకా మధు మంతెన రిసెప్షన్ కి రాజ్ కుమార్ రావు, సారా ఆలీ ఖాన్, ఫర్దీన్ ఖాన్, అషుతోష్ గోవరికర్, అనిల్ కపూర్ ఇతర బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. అప్పట్లో మధు మంతెన సహకారంతోనే అల్లు అరవింద్ గజనీ సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. బాలీవుడ్‌లో తొలి 100 కోట్ల సినిమాగా గజనీని తీర్చిదిద్దారు. అలా మధ మంతెనతో ఉన్న అనుబంధంతోనే అల్లు అర్జున్ రిసెప్షన్‌కు హాజరైనట్టు సమాచారం. 

Allu Arjun meets Hrithik Roshan, Aamir Khan at Madhu Mantena bash:

Aamir Khan, Allu Arjun and Hrithik Roshan hug and greet each other at Madhu-Ira reception
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs