Advertisement
Google Ads BL

ఫేమస్ టిఫిన్ సెంటర్ లో కీర్తి సురేష్


హీరోయిన్ కీర్తి సురేష్ దసరా సక్సెస్ తర్వాత తెలుగులో భోళా శంకర్, తమిళంలో కొన్ని ప్రాజెక్ట్స్ షూటింగ్స్ తో సందడి చేస్తుంది. తాజాగా కీర్తి సురేష్ భోళా శంకర్ సాంగ్ షూట్ కోసం హైదరాబాద్ వచ్చింది. హైదరాబాద్ లో భోళా శకంర్ షూటింగ్ పూర్తి కాగానే తన ఫ్రెండ్స్ తో కలిసి కీర్తి సురేష్ హైదరాబాద్ వీధుల్లో చక్కర్లు కొట్టడమే కాకుండా.. కొండాపూర్ ప్రాంతంలోని ఫేమస్ టిఫిన్ సెంటర్ అయిన వరలక్ష్మి టిఫిన్ సెంటర్ కి వెళ్ళండి.

Advertisement
CJ Advs

కీర్తి సురేష్ తన స్నేహితులతో కలిసి మాస్క్ ధరించి వరలక్ష్మి టిఫిన్ సెంటర్ కి వెళ్లిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వరలక్ష్మి టిఫిన్ సెంటర్ అంటే మిడ్ నైట్ కూడా రద్దీగా ఉండే టిఫిన్ సెంటర్ అలాంటి టిఫిన్ సెంటర్ కి వెళ్లిన కీర్తి సురేష్ ఫ్రెండ్స్ తో కలిసి టిఫిన్ తినేసి తందూరి టీ కూడా తాగేసిందట. కానీ కీర్తి సురేష్ ని ఆ చీకటిలో ఎవ్వరూ గుర్తుపట్టలేదట. కారణం ఆమె మాస్క్ ధరించడమే అని.. తెలుస్తుంది.

అయితే ఫ్రెండ్స్ తో టిఫిన్ తిని టీ తగిన విషయాన్ని కీర్తి సురేష్ ఇన్స్టా లో పిక్స్ పోస్ట్ చేసి తెలియజేసింది. మాస్క్ ధరించడం వలన తనని ఎవరూ గుర్తుపట్టలేదని చెప్పుకొచ్చింది.

Keerthy Suresh at Famous Tiffin Centre:

Keerthy Suresh springs a surprise at a tiffin center
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs