Advertisement
Google Ads BL

పుష్ప 2 ఇంటర్వెల్ సీన్ పై క్రేజీ న్యూస్


దర్శకుడు సుకుమార్ పుష్ప ద రూల్ షూటింగ్ ని చకచకా ముగించే పనిలో ఉన్నారు. అల్లు అర్జున్-రష్మిక-ఫహద్ ఫాసిల్ కలయికలో పుష్ప ద రూల్ ప్రస్తుతం చిత్రీకరణలో దశలో ఉంది. సుకుమార్ ఫహద్ ఫాసిల్ పై క్రేజీ సన్నివేశాల ఎపిసోడ్ ఇప్పటికే పూర్తి చేసారు. రీసెంట్ గా అల్లు అర్జున్ తన భార్య తో కలిసి చిన్నపాటి వెకేషన్ కంప్లీట్ చేసుకుని వచ్చారు. అలాగే వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ కూడా ముగియడంతో ఆయన పుష్ప 2 షూటింగ్ కొత్త షెడ్యూల్ లో జాయిన్ అవ్వబోతున్నారు.

Advertisement
CJ Advs

మధ్యలో సుకుమార్ మరియు నిర్మాతలపై ఐటి రైడ్స్ జరగడంతో పుష్ప 2 షూటింగ్ కి కాస్త బ్రేకులు పడ్డాయి. ఆ తర్వాత సుకుమార్ చాలా స్పీడుగా పుష్ప షూటింగ్ చుట్టేస్తున్నారు. తాజాగా పుష్ప 2 ఇంటర్వెల్ సీన్ పై క్రేజీ న్యూస్ ఒకటి బయటికి వచ్చింది. అల్లు అర్జున్ బర్త్ డే వీడియో లో పుష్ప రాజ్ చనిపోయాడు అనుకుంటూ దేశవిదేశాల్లో జల్లెడపడుతున్న పోలీసులకి ఫారెస్ట్ లో బ్రతికి ఉన్న పుష్ప రాజ్.. ఇంటర్వెల్ ముందే ట్విస్ట్ ఇస్తాడని, ఈ ఇంటర్వెల్ సీక్వెన్స్ లోనే రష్మిక పాత్రకి సంబంధించిన డెత్ మిస్టరీ కూడా రివీల్ అవుతుంది అంటూ ఓ న్యూస్ హైలెట్ అయ్యింది. 

పుష్ప 2 ఇంటర్వెల్ బ్యాంగ్ సినిమాకే హైలెట్ అవుతుందట, మరి సుకుమార్ ఈ సీక్వెన్స్ పై ఇచ్చిన హైప్ తో అల్లు ఫాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు. ఇక ఈ చిత్రంలో నిహారిక, ఇంకా చాలామంది బాలీవుడ్, మలయాళ, తమిళ నటులు భాగం కాబోతున్నారని.. పుష్ప పార్ట్ 1 కి మించిన కంటెంట్ తో ఈ చిత్రం డిసెంబర్ లో ఆడియన్స్ ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. 

Crazy news on Pushpa 2 interval scene:

Interesting Details About Pushpa 2 Interval
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs