కొరియోగ్రాఫర్ కమ్ హీరో కమ్ డైరెక్టర్ ప్రభుదేవా ఇప్పుడు ఆల్మోస్ట్ బాలీవుడ్ లోనే ఉంటున్నాడు. తెలుగు, తమిళ సినిమాల్లో డాన్స్ మాస్టర్ గా విపరీతమైన పాపులారిటీ సంపాదించడమే కాదు .. నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రం దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. తర్వాత డైరెక్షన్ చేస్తూనే నయనతారతో ప్రేమాయణం నడిపి భార్య రమాలతకి విడాకులిచ్చి నయనతారతో పెళ్ళికి సిద్దమయ్యాడు. నయనతార-ప్రభుదేవాల ప్రేమ పెళ్లి వరకు వచ్చి ఆగిపోయింది. తర్వాత ముంబైలో సెటిల్ అయ్యాడు ప్రభుదేవా.
రీసెంట్ గానే అంటే 2020 లో ముంబైకి చెందిన ఫిజియోథెరపిస్ట్ హిమాని సింగ్ తో ప్రేమలో పడడమే కాదు ఆమెని వివాహం కూడా చేసుకున్నాడు. ఆ విషయాన్ని ఓపెన్ అవ్వకపోయినా.. ప్రభుదేవా ఆ అమ్మాయిని వివాహం చేసుకున్నాడనే హింట్ ఇచ్చాడు. అయితే తాజాగా హిమనీ-ప్రభుదేవాలకి కూతురు పుట్టింది. ఈ విషయాన్ని ప్రభుదేవానే అందరితో పంచుకున్నాడు. ప్రభుదేవా తన మొదటి భార్యకి ముగ్గురు అబ్బాయిలు ఉన్నారు. ఇప్పుడు ప్రభుదేవాకి 50 ఏళ్ళు. ఇప్పుడు మరో అమ్మాయి పుట్టినట్టుగా ప్రభుదేవా చెప్పాడు.
అంటే ప్రభుదేవాకి ఇప్పుడు నలుగురు పిల్లలు. భార్య రమాలతకి విడాకులిచ్చేసిన ప్రభుదేవా తన పిల్లల ఆలనాపాలనా చూసుకుంటున్నాడు. తన రెండో భార్యకి ఓ పాప పుట్టడంతో ప్రభుదేవా చాలా సంతోషంగా ఉన్నట్లుగా తెలుస్తుంది.