కాజల్ అగర్వాల్ సినిమాలకి ఫుల్ స్టాప్ పెట్టబోతోందా.. ఇప్పుడదే హాట్ టాపిక్. పెళ్లి తర్వాత కూడా కాజల్ గ్లామర్ షూట్ వదల్లేదు. బాబు పుట్టాక చాలా కొద్దినెలలకే కాజల్ అగర్వాల్ ఇండియన్ 2 షూటింగ్ లో జాయిన్ అయ్యింది. తన తల్లికి బాబు నీల్ ని అప్పజెప్పి తరచూ కాజల్ అగర్వాల్ షూటింగ్స్ అంటూ హైదరాబాద్ టు చెన్నై అంటూ బిజీ లైఫ్ లోకి వచ్చేసింది. హైదరాబాద్ NBK108 షూటింగ్ కోసం వస్తుంటే చెన్నై కి ఇండియన్ 2 షూటింగ్ కోసం వెళుతుంది.
అలా తన బాబుకి దూరమైనా తన లైఫ్ సెటిల్ చేసేందుకే ఇలా చేస్తున్నాను. ఇలా చేస్తుంటే తనని తన కొడుకు పెరిగాక అర్ధం చేసుకుంటాడు.. కానీ ఇప్పుడు నీల్ కి దూరంగా ఉంటున్నాను అది కొద్దిగా బాధనిపిస్తుంది అంటూ కాజల్ ఓ సందర్భంలో చెప్పింది. కానీ ఇప్పుడు తన కొడుకు ఆలనా పాలనా కోసమే ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పనుంది అనే న్యూస్ నడుస్తుంది. మరి నిజంగానే కాజల్ కొడుకు కోసం కెరీర్ ని త్యాగం చేస్తుందా..
అదే నిజమైతే కాజల్ అభిమానులు బాగా డిస్పాయింట్ అవుతారు. పెళ్లి, పిల్లలు తర్వాత కూడా కాజల్ అగర్వాల్ గ్లామర్ విషయంలో ఎక్కడా తగ్గడమే లేదు. ఇంకాస్త గ్లామర్ షో చేస్తుంది తప్ప.. ట్రెడిషనల్ గా కనిపించడం లేదు.