సినిమాల్లో హీరోయిన్ గా ఓ స్టేటస్ ని మెయింటింగ్ చేసిన ఆర్కే రోజా.. తర్వాత జబర్దస్త్ జెడ్జ్ గా చాలారోజులు సినిమా ఇండస్ట్రీలోనే కనిపించింది. జబర్దస్త్ కి రాకముందే రాజకీయాలలో అడుగుపెట్టి టీడీపీ పార్టీలో చేరింది. మొదటిసారి ఎమ్యెల్యేగా పోటీ చేసి ఓడిపోయి తర్వాత టీడీపీ నుండి వైసిపిలోకి జంప్ అయ్యి అక్కడ ఎమ్యెల్యేగా గెలిచి తర్వాత మినిస్టర్ పదవి చేపట్టింది. పర్యాటక శాఖ మంత్రిగా రాజకీయాల్లో హడావిడి చేస్తూ జబర్దస్త్ నుండి పక్కకి తప్పుకుంది.
కొన్నాళ్ళుగా ప్రజల్లోనే కాదు.. ప్రత్యర్థుల గుండెల్లో నిద్రపోతున్న ఆర్కే రోజా తాజాగా ఆసుపత్రి పాలైంది. చెన్నైలోని ప్రముఖ అపోలో ఆసుపత్రిలో రోజా జాయిన్ అయినట్లుగా తెలుస్తుంది. ఆమె స్వల్ప అస్వస్థతకు గురి కాగా కుటుంభ సభ్యులు ఆమెని చెన్నై అపోలోలో జాయిన్ చేసినట్లుగా వార్తలొస్తున్నాయి. రోజా కాలు నొప్పి, వాపుతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. హాస్పిటల్ లో రోజాకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, కాలువాపు కూడా తగ్గిందని డాక్టర్లు చెబుతున్నారు.
త్వరలోనే రోజాను డిశ్చార్జ్ చేస్తామని ఆస్పత్రి వర్గాలు వెల్లడించినట్లు సమాచారం. రోజా ఆసుపత్రిలో చేరింది అన్న వార్త చూసి ఆమె అభిమానులు, వైసిపీ శ్రేణులు ఆందోళనపడినప్పటికీ.. డాక్టర్స్ రోజా ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేదని చెప్పడంతో వారు ఊపిరి పీల్చుకుంటున్నారు.