సమ్మర్ అంటేనే ఎండలు. కానీ ఈ సమ్మర్ మాత్రం ప్రజలని భయపెట్టేసింది. ఎండ తీవ్రతకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ ఏడాది ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది.. కానీ అందుకు తగ్గ సినిమాలేమి ప్రేక్షకులని ఇంప్రెస్స్ చేయలేకపోయాయి. భారీ బడ్జెట్ సినిమాలు రావాల్సిన సమ్మర్ లో అన్నీ మీడియం, చిన్న సినిమాలే రిలీజ్ అయ్యాయి. పోనీ అవన్నా ప్రేక్షకులని ఇంప్రెస్స్ చేశాయా అంటే అదీ లేదు. ప్రతి వారం పొలోమంటూ బాక్సాఫీసు దగ్గరకి సినిమాలు రావడం.. అన్నీ ప్రేక్షకులని డిస్పాయింట్ చెయ్యడం.. ఇలా ప్రేక్షకులంతా ఓ మంచి సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.
గత వారం విడుదలైన విమానం, టక్కర్, అన్ స్టాపబుల్ ఇలా ప్రతి ఒక్కటీ ఆడియన్స్ ని నిరాశ పరిచాయి. మరి ఈ వేసవి తాపాన్ని ఆదిపురుషుడైనా తీరుస్తాడా? ప్రభాస్ ఆదిపురుష్ పై అంచనాలు భారీగా కనిపిస్తున్నాయి. మరో ఐదు రోజుల్లో ఆదిపురుష్ ఆగమనం. ఎక్కడో కాస్త నెగిటివిటి ఉన్నప్పటికీ.. ప్రభాస్ మీద అభిమానంతో మొదటి రోజు ఓపెనింగ్స్ అదిరిపోవడం ఖాయం. సినిమాకి కొద్దిగా పాజిటివ్ టాక్ వచ్చినా ఆదిపురుష్ కి భారీ కలెక్షన్స్ రావడం పక్కా. కలెక్షన్స్ కొత్త రికార్డులు సెట్ చేసినా చెయ్యొచ్చు.
ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు ఉన్న ఊపు చూస్తే మాత్రం కచ్చితంగా ఈ సినిమా మొదటి రోజు ఓ రేంజ్ లో కలెక్షన్స్ పోగేసి రికార్డులని క్రియేట్ చేస్తుంది అనడంలో సందేహం కనిపించడం లేదు. ప్రభాస్-కృతి సనన్ జంటగా ఓం రౌత్ తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రికార్డ్ థియేటర్స్ లో విడుదలవుతుంది.