వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిలు ఏడేళ్లుగా సీక్రెట్ ప్రేమలో ఉండి.. జూన్ 9 న అధికారికంగా తామిద్దరం ఒక్కటి కాబోతున్నామంటూ ఎంగేజ్మెంట్ రింగ్స్ మార్చుకున్నారు. వరుణ్ తేజ్-లావణ్య ఇద్దరూ తమ ప్రేమని పెద్దల అంగీకారంతో ఒక్కటిగా మార్చుకుని పెళ్ళికి సిద్ధమయ్యారు. మెగాస్టార్ చిరు ఆయన సతీమణి సురేఖ చేతుల మీదుగా వరుణ్ తేజ్ నిశ్చితార్ధం అంగరంగ వైభవంగానే ఇరు కుటుంబాల మధ్యన జరిగిపోయింది. అల్లు అర్జున్, రామ్ చరణ్ తమ తమ భార్యలతో హాజరవగా.. పవన్ కళ్యాణ్ మాత్రం సింగల్ గా స్టయిల్ గా హాజరయ్యారు.
అయితే వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిలు ఎంగేజ్మెంట్ సింపుల్ గా చేసిన మెగా ఫ్యామిలీ పెళ్లి మాత్రం గ్రాండ్ గానే చెయ్యబోతున్నట్టుగా తెలుస్తుంది. అది కూడా డెస్టినేషన్ వెడ్డింగ్ గా వరుణ్-లావణ్యలు తమ వివాహం చేసుకోబోతున్నట్టుగా సమాచారం. నిహారిక పెళ్లిని నాగబాబు రాజస్థాన్ వేదికగా రెండురోజుల పాటు గ్రాండ్ గా నిర్వహించారు. ఇప్పుడు వరుణ్ తేజ్ పెళ్లి కూడా అదే లెక్కన చెయ్యబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిలు ఇటలీలో వివాహం చేసుకోబోతున్నారనే టాక్ వినిపిస్తుంది.
డెస్టినేషన్ వెడ్డింగ్ పరంగానే కాకుండా వారి ప్రేమ ఇటలీలో పుట్టడంతో వరుణ్ తేజ్-లావణ్యలు అక్కడే పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారట. మరి ఈ విషయంలో మెగా ఫ్యామిలీ కూడా వరుణ్ నిర్ణయాన్ని స్వాగతించినట్లుగా.. అక్కడ పెళ్లి చేసి హెదెరాబాద్ లో గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాట్లు చెయ్యాలని ఆలోచిస్తున్నారట. నవంబర్ కానీ, డిసెంబర్ లో కానీ వరుణ్ - లావణ్యల వివాహం జరగవచ్చని తెలుస్తుంది.